‘Mega-city’ under the ant hill : చీమలు కట్టిన ‘మెగా-సిటీ’ .. ఔరా అంటారు

చీమల్ని చూస్తే ఐకమత్యంగా ఉండటం ఎలానో తెలుస్తుంది. అలాగే కష్టపడటం కూడా.. అవి గుంపులు గుంపులుగా కలిసి అద్భుతమైన నిర్మాణాలు కట్టేస్తాయి. రీసెంట్‌గా శాస్త్రవేత్తలు చీమల కొండ కింద మెగా-సిటీని కనిపెట్టారు.

‘Mega-city’ under the ant hill : చీమలు కట్టిన ‘మెగా-సిటీ’ .. ఔరా అంటారు

'Mega-city' under the ant hill

Viral News : చీమలు గొప్ప బిల్డర్లు అని మీకు తెలుసా? పాడుబడిన ఓ చీమల కొండపైకి టన్నులకొద్దీ సిమెంట్ పంప్ చేసిన తరువాత శాస్త్రవేత్తల బృందం ఆశ్చర్యపోయింది. కొండ కింద మెగా-సిటీని కనిపెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Yellow Crazy Ants: తమిళనాడులో ప్రజలను హడలెత్తిస్తోన్న చీమలు.. ఊళ్లను ఖాళీ చేస్తున్న జనం.. ఎందుకిలా అంటే?

చీమలు జట్లు జట్లుగా ఉంటాయి. వాటి బరువుకున్నా పదిరెట్లు బరువును మోసేస్తాయి. వీటిలో చాలా చీమలు శ్రామికులుగా ఉంటాయి. మట్టితో అందమైన నిర్మాణాలు కట్టేస్తాయి. అలా చీమలు కట్టుకున్న ఓ పాడుబడిన చీమల కొండపైకి టన్నులకొద్దీ సిమెంట్‌ను పంప్ చేశారు శాస్త్రవేత్తలు. పదిరోజుల తరువాత చూస్తే వారు ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. చీమలపై కొందరు శాస్త్రవేత్తలు డాక్యుమెంటరీ తీస్తున్నారు. దానికి సంబంధించిన ఓ పోస్ట్ ను Massimo అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ‘3 రోజుల వ్యవధిలో శాస్త్రవేత్తలు 10 టన్నుల సిమెంట్‌ను పాడుబడిన చీమల కొండలోకి పంప్ చేశారు. వారాలా తరువాత తవ్వి చూస్తే విచిత్రమైన.. ఆకర్షణీయమైన నిర్మాణం బయటపడింది’ అనే శీర్షికతో ఈ పోస్ట్‌ను పెట్టారు.

Ants Eating Cashews: చీమలు పట్టిన జీడిపప్పు తిని వాంతులు చేసుకున్న యువకులు.. వీడియోకు 10మిలియన్ల వ్యూస్..

పాడుబడిన చీమలకొండపై శాస్త్రవేత్తలు సిమెంట్ పోస్తున్నట్లుగా వీడియో మొదలౌతుంది. మూడురోజుల పాటు ఆ రంధ్రంలో పది టన్నుల సిమెంట్ పోశామని వీడియోలో చెప్తారు. తరువాత తవ్వడం ప్రారంభించారు. అంతే నమ్మశక్యం కాని భూగర్భ నిర్మాణాన్ని చూశారు. ప్రధాన గదులను కలుపుతూ భూగర్భ రహదారులు, ప్రధాన మార్గాలు, రోడ్లు’ వీడియోలో కనిపిస్తాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ‘చీమలను చూసి చాలా నేర్చుకోవాలని.. సమిష్టి కృషితో అవి చేసిన నిర్మాణాలు అద్భుతమని చాలామంది ట్వీట్ చేశారు.