కరోనా కట్టడికి కొత్త ఫార్ములా, మిక్స్డ్ డోస్‌పై శాస్త్రవేత్తల ఫోకస్

కరోనా కట్టడికి కొత్త ఫార్ములా, మిక్స్డ్ డోస్‌పై శాస్త్రవేత్తల ఫోకస్

india covid-19-vaccine

Covid-19 Vaccine Mixing Different Doses: కరోనా కట్టడికి కొత్త ఫార్ములా కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మిక్స్డ్ డోస్(mixed dose) పై దృష్టి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి పైగా భయాందోళనలకు గురి చేసిన కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలకు ఇంకా అంతు చిక్కలేదు. కాగా, వ్యాక్సిన్ తయారీ కోసం చేసిన పరిశోధనలలో మాత్రం సక్సెస్ అయ్యారు. వారు గమనించిన డేటా ప్రకారం మొత్తం 4వేల కోవిడ్ రకాలు ఉన్నాయి.

అలాంటి వాటన్నింటిపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయాలంటే ఏదో ఒక వ్యాక్సిన్ సరిపోదని, కచ్చితంగా మిక్స్డ్ వ్యాక్సిన్ ఉండాల్సిందే అంటున్నారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా, షాట్స్ ల.. మిక్స్డ్ డోస్ లు తీసుకుంటే ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ వేరియంట్స్ వేల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. బ్రిటన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా వేరియంట్లు వ్యాగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు.

ప్రస్తుత వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై పని చేయకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కంపెనీలు పైజర్, మోడన్నా, ఆస్ట్రాజెనెకా, బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ల ఫలితం ఎఫెక్టివ్ గా ఉండాలంటే మిక్స్డ్ డోస్ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4వేలకు పైగా కరోనా వేరియంట్లు కనిపించాయని, అందులో చాలావరకు ఇతర వాటికంటే మైనర్ మార్పులతో కనిపించగా, మిగతా అన్నింటిలో భారీ తేడాలు ఉన్నట్టు గుర్తించారు.