సాహస ప్రేమికుడు : ప్రేయసిని చూడటానికి ఐరీష్ సముద్రాన్ని దాటిన ప్రియుడు..పాపం చివరకు జరిగిందేమంటే..

సాహస ప్రేమికుడు : ప్రేయసిని చూడటానికి ఐరీష్ సముద్రాన్ని దాటిన ప్రియుడు..పాపం చివరకు జరిగిందేమంటే..

Scotland : Jailed For Travelling Illegally By Jet-Ski To See His Girlfriend : ‘‘’సాహసం చేయరా..డింభకా..రాజకుమారి లభించునురా’’..అని పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడు చెప్పిన డైలాగ్ ఇదిగో ఈ యువకుడికి చక్కగా సరిపోతుంది. అలాగే ప్రేమ కోసమే వలలో పడెనే పాపం పసివాడు.. ’’ అంటూ పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్‌పై ఓ పాట ఉంది. ఈ స్కాట్లాండ్ కుర్రాడికి ఆ పాట సరిగ్గా సరిపోతుంది. ప్రియురాలి కోసం నదిని దాటి, గడ్డకట్టే మంచులో ప్రయాణించి.. చివరకు పాపం ఈ యువకుడు పోలీసులకు చిక్క ఊచలు లెక్క పెడుతున్నాడు. ప్రియురాలిని చూడాలనే తపనతో చలిని కూడా లెక్కచేయకుండా ఏకంగా సముద్రాన్నే దాటి వచ్చిన ప్రియుడు సాహసగాధ చివరకు కటకటాలపాలైంది. మరి అంత ఘాటు ప్రేమికుడి గాథ గురించి తెలుసుకుందాం..

స్కాట్లాండ్‌కు చెందిన 28 ఏళ్ల డేల్ మెక్‌లాగన్ తన ప్రియురాలి కోసం ఏకంగా సముద్రాన్నే దాటి రావటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ప్రేమించిన అమ్మాయి కోసం డేల్ ఏకంగా ఐరీష్ సముద్రాన్ని దాటి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది హీరో అయిపోయాడు.

ఈ వీరప్రేమికుడి కథ అసలు విషయానికొస్తే.. డేల్ ప్రేమించిన అమ్మాయి పేరు జెస్సికా రెడ్ క్లిఫ్. ఐరీష్ సముద్రంలోని ‘ఐల్ ఆఫ్ మన్‌’ దీవిలోని రామ్సేలో నివాసిస్తోంది. డేల్ గత సెప్టెంబర్‌లో ఆ ఐల్ ఆఫ్ మన్‌’ దీవిలో పని చేయడానికి వెళ్లినప్పుడు జెస్సికాతో పరిచయం అయి ప్రేమలో పడ్డాడు. ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. ఈక్రమంలో డేల్ కు ఆ దీవిలో కాంట్రాక్ట్ వర్క్ పూర్తికావటంతో తను ఉండే హోమ్ టౌన్‌కు వెళ్లిపోయాడు. అలా వెళ్లాడనే మాటే గానీ ప్రేయసిని చూడకుండా ఉండలేకపోయేవాడు. అస్తమాను ఆమె ధ్యాసే. ఏ పనిచేసినా ఆమె ఆలోచనలే.

ప్రేయసి దూరంగా ఉండలేకపోయేవాడు డేల్. ఎలాగైనా ఆమెను చూడాలనుకున్నాడు. మళ్లీ ఐల్ ఆఫ్ మన్ దీవికి వెళ్లాలనుకున్నాడు. దానికోసం పర్మిషన్ ఇవ్వమని కోరుతూ అప్లై చేసుకున్నాడు. కానీ అధికారులు పర్మిషన్ ఇవ్వాలేదు. దీంతో బేజారెత్తిపోయాడు ఆ ఘాటు ప్రేమికుడు. ఎలాగైనా సరే జెస్సికాను చూడాలనుకున్నాడు.

దీని కోసం ఓ సాహసమే చేశాడీ ప్రేమికుడు. జెస్పికాను చూడటానికి దీవికి వెళ్లాలనుకున్నాడు. దాని కోసం 5వేల పౌండ్లు ఖర్చుపెట్టి ఓ జెట్ స్కై(బోటు) కొనుక్కుని..స్కాట్లాండ్ నుంచి ‘ఐల్ ఆఫ్ మన్‌’ దీవికి ఐరీష్ సముద్రంలో రామ్సేకి చేరుకున్నాడు. ఏదన్నా ప్రమాదం జరిగితే సురక్షితంగా చేరుకోవటానికి డేల్ కు అతనికి ఈత కూడా రాదు. కానీ ప్రేయసిని చూడాలనే తపనతో అతనికి విషయం గుర్తురాలేదు.

స్కాట్లాండ్ నుంచి ‘ఐల్ ఆఫ్ మన్‌’ దీవికి ఆ మొత్తం దూరం 25మైళ్లు. తన ప్రేమకు ఉన్న స్పీడుతో 25 మైళ్ల దూరానని 30 లేదా 40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చనుకున్నాడు. పైగా జెక్సికాను చూడాలనే కోరి అంతకంతకూ పెరిగిపోవటంతో. కానీ ప్రేమకున్న స్పీడు అతనికి బోటు నడపటంలో లేదు. పైగా ఎప్పుడూ బోటు నడిపిన అలవాటు కూడా లేదు. దీంతో అని ప్రయాణం ఐరిష్ సముద్రంలో గడ్డకట్టే చలిలో నాలుగు గంటలకు పైనే సాగింది. చలికోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నాగానీ చలికి తట్టుకోలేకపోయాడు పాపం.

అలా ఎట్టకేలకూ సముద్రం దాటాడు. ఆ తరువాత మరో 15 మైళ్లు నడిచాడు. చివరకు ప్రేయసి జెస్సికా ఇంటికి గత శుక్రవారం (డిసెంబర్ 11,2020)చేరుకున్నాడు. అతను అదే దీవిలో ఉంటున్నాడనుకుంది జెస్సికా.

కానీ పాపం జెస్సికాకు తెలిదు తన ప్రేమికుడు డేల్ తనకోసం అంత సాహసయాత్ర చేసి వచ్చాడని..తర్వాత రోజు ఇద్దరు కలిసి ఓ నైట్ క్లబ్‌కు వెళ్లారు. జెస్సికాను చూసిన ఆనందంలో గాల్లో తేలిపోతున్నాడు డేల్. అలా వాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా పోలీసుల కంట పడ్డారు. దీంతో అతనిపై అనుమానం వచ్చి ఆరాతీయటంతో అసలు విషయం బటయపడింది.

కానీ పాపం డేల్ పోలీసులకు తాను ఇక్కడ ఉండిపోవటానికి రాలేదనీ..త్వరలోనే వెళ్లిపోతానని నెత్తీ నోరు కొట్టుకుని మొత్తుకున్నాడు. కానీ పోలీసులు వినలేదు. పర్మిషన్ లేకుండా వచ్చాడనే ఆరోపణతో కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టారు.

అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాడనీ..పైగా ప్రమాదకరంగా మారిన కోవిడ్ నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి.. మొత్తం నగరాన్ని రిస్క్‌లో పెట్టేలా డేల్ చర్యలు ఉన్నాయంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించి నాలుగు వారాలపాటు జైలుశిక్ష విధించింది. అలా పాపం ప్రేమ పక్షి కాస్తా జైలు పక్షి అయిపోయాడు.