Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు

సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి.

Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు

Secunderabad Riots

Secunderabad Riots : సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. మొన్నటివరకు దాదాపు 60మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ మరో 10మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న పది మందిని అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు.

Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు

నిందితులను కోర్టుకి తరలిస్తుండగా వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బిడ్డలు అమాయకులని, ఎవరో రెచ్చగొడితే ఇదంతా చేశారని వారు కన్నీటిపర్యంతం అయ్యారు. అటు పది మంది నిందితులను రైల్వే కోర్టుకి తరలించారు పోలీసులు. వారందరిని చంచల్ గూడ జైల్లో రిమాండ్ చేయనున్నారు పోలీసులు. ఇక ఈ కేసులో బోగీలకు నిప్పు పెట్టి, బోగీల అద్దాలను ధ్వంసం చేసిన పృథ్వీరాజ్ ను పోలీసులు ఏ12 నుంచి ఏ2గా మార్చారు. ఇవాళ వచ్చిన సెల్ఫీ వీడియోల ఆధారంగా పోలీసులు పృథ్వీని ఏ2గా మార్చారు.(Secunderabad Riots)

agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు

ఇవాళ అరెస్ట్ అయిన నిందితుల పేర్లు..
ఏ2 రాథోడ్ పృథ్వీరాజ్(ఏ12 నుంచి ఏ2గా మార్పు)
ఏ3 బింగి రమేశ్
ఏ4 రాజా సురేంద్ర కుమార్
ఏ5 సంతోష్
ఏ6 మహ్మద్ సబార్
ఏ57 యోగేష్
ఏ58 పరుశురాం
ఏ59 అయ్యప్పచారి
ఏ60 శివసుందర్ రెడ్డి
ఏ61 తుకారాం

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులను రెచ్చగొట్టి వారితో విధ్వంసం చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు రాబట్టారు.

విధ్వంసం వెనుక సుబ్బారావు హస్తం ఉందని తేల్చరు. 10కి పైగా వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేసి పక్కా ప్లాన్ తోనే సుబ్బారావు విద్యార్థులను రెచ్చగొట్టాడని నిర్ధారించారు. దీంతో సుబ్బారావుతో సహా నిన్న అదుపులోకి తీసుకున్న 15 మందిని రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.

Secunderabad Violence Pruthvi : నా కుమారుడు బోగీలకు నిప్పు పెడతాడని ఊహించలేదు- పృథ్వీ తల్లిదండ్రులు

సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూన్ 17) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగి మరణించాడు. పలువురు గాయపడ్డారు.