Kamal Haasan: కమల్ హాసన్‌ కారుపై దాడి..

తమిళ సినిమా నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ రాజకీయ పార్టీ నాయకుడు కమల్ హాసన్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆదివారం పబ్లిక్ మీటింగ్ తర్వాత కారులోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కాంచీపురంలో కారు ఉన్న సమయంలో కారు అద్దం తెరిచేందుకు ట్రై చేసినట్లు సమాచారం.

Kamal Haasan: కమల్ హాసన్‌ కారుపై దాడి..

Kamal Hasan

Kamal Haasan: తమిళ సినిమా నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ రాజకీయ పార్టీ నాయకుడు కమల్ హాసన్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆదివారం పబ్లిక్ మీటింగ్ తర్వాత కారులోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కాంచీపురంలో కారు ఉన్న సమయంలో కారు అద్దం తెరిచేందుకు ట్రై చేసినట్లు సమాచారం.

రాజధాని చెన్నైకు వెళ్తుండగా ఘటన జరిగింది. ఏప్రిల్ 6న జరగనున్న రాష్ట్ర ఎన్నిక సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కమల్ పాల్గొన్నారు. ఆల్కహాల్ తాగి ఉన్న వ్యక్తి కారు అద్దం తీసేందుకు ప్రయత్నించాడు. ఈ లోపే కమల్ మద్దతుదారులు, పబ్లిక్ అలర్ట్ అయి అతణ్ని వెనక్కు లాగారు. ఆ తర్వాత అతణ్ని పోలీసులు హాస్పిటల్ కు తరలించారు.

ఘటన వెనుక కారణంపై విచారణ జరుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అతను కూడా కమల్ అభిమానియేనని చెప్తున్నారు. కమల్ హాసన్ కు ఎటువంటి హాని జరగలేదని, కారుకు కూడా ఎటువంటి డ్యామేజి జరగలేదని అధికారులు చెప్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో దక్షిణ కొయంబత్తూరు నుంచి పోటీ చేయాలని కమల్ ప్లాన్ చేస్తున్నారు.

అవినీతి, ఉద్యోగాలు, గ్రామాభివృద్ధి, ఈ గవర్ననెన్స్ కీలకాంశాలుగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. హోం మేకర్స్ కు జీతాలివ్వడం, ప్రతి ఇంటికి ఉచిత కంప్యూటర్ ఇస్తామని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాలు మే2న విడుదల అవుతాయి.