Aziz Qureshi : యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై విద్రోహం కేసు

యోగీ రక్తం తాగే రాక్షసుడంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు అజీజ్ ఖురేషీ. తాను అలా మాట్లాడలేదని... మిస్ కోట్ చేశారని చెప్పారు.  

Aziz Qureshi : యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై విద్రోహం కేసు

Aziz Qureshi

Aziz Qureshi : ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై విద్రోహ చట్టం కింద కేసు నమోదైంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ జనం రక్తం తాగే రాక్షసుడు అంటూ తీవ్రమైన పదజాలంతో విమర్శించడం వివాదాస్పదమైంది. ఈ మొత్తం వ్యవహారంపై… ఖురేషీ తాజాగా వివరణ ఇచ్చుకున్నారు.

అజీజ్ ఖురేషీపై కేసు నమోదు చేయాలంటూ.. బీజేపీ నేత ఆకాశ్ కుమార్ సక్సేనా రాంపూర్ లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాజ్ వాదీ పార్టీ లీడర్ ఆజంఖాన్ ఇంట్లో ఆయన భార్య తజీన్ ఫత్మాతో జరిగిన భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు ఆకాశ్ కుమార్ సక్సేనా. సీఎం యోగీపై అజీజ్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలు.. రెండు వర్గాల మధ్య అశాంతిని రగిల్చేలా ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు. దీంతో… సోమవారం ఖురేషీపై సెడిషన్ చట్టం కింద కేసు పెట్టారు.

Read This : CBI : సీబీఐ పని తీరుపై సుప్రీం ఆగ్రహం

ఈ వార్త లోకల్ గా అనేక ఛానెళ్లలో ప్రసారం అయింది. యూపీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఖురేషీపై సెడిషన్ చట్టం… 153A, 153 B, 124A, 505(1) B  సెక్షన్ల ప్రకారం అభియోగాలు నమోదుచేశారు. యోగీ రక్తం తాగే రాక్షసుడంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు అజీజ్ ఖురేషీ. తాను అలా మాట్లాడలేదని… మిస్ కోట్ చేశారని చెప్పారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ఖురేషీ వయసు 81 ఏళ్లు.  2014- 2015మధ్య మిజోరం గవర్నర్ గా పనిచేశారు.  కొంత కాలం పాటు యూపీ గవర్నర్ గానూ సేవలందించారు.