ఏప్రిల్ 2న ‘సీటీమార్’..

ఏప్రిల్ 2న ‘సీటీమార్’..

Seetimaar: మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా.. ‘‘సీటీమార్’’.. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో.. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా గోపిచంద్ 28వ సినిమా ఇది. మ్యాచో హీరో సరసన మిల్కీబ్యూటీ తమన్నా జతకడుతుండగా.. దిగంగన సూర్యవంశీ మరో కథానాయికగా నటిస్తోంది.

Seetimaarr

రావు రమేష్, భూమికా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపిచంద్ ఆంధ్రప్రదేశ్, తమన్నా తెలంగాణ జట్లకు కోచ్‌లుగా కనిపించనున్నారు. తాజాగా ‘సీటీమార్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Seetimaarr

ఏప్రిల్ 2న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్షన్ మోడ్‌లో ఉన్న గోపి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి సంగీతం : మణి శర్మ, కెమెరా : ఎస్. సౌందర్ రాజన్, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, సమర్పణ : పవన్ కుమార్, నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం : సంపత్ నంది.

Seetimaarr