Seetimaarr : దసరాకి ‘సీటీమార్’

గోపిచంద్ - తమన్న నటించిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘సీటీమార్’ దసరా కానుకగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది..

Seetimaarr : దసరాకి ‘సీటీమార్’

Seetimaarr

Seetimaarr: మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో, మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో.. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో, శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

Samantha : ‘సాకీ’ లో అక్కినేని ఉందిగా.. సమంత పేరు మారుస్తుందా?

పాండమిక్ తర్వాత హాళ్లల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘సీటీమార్’ పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్లు రాబట్టింది. గోపిచంద్, తమన్నాల నటన, కబడ్డీ ఆట గురించి ఎమోషనల్‌గా చెప్పిన విధానం.. మణిశర్మ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Tamil Stars : అన్ని కోట్లిచ్చి టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నారా?

వినాయక చవితికి థియేటర్లలోకి వచ్చిన ‘సీటీమార్’ సినిమా దసరా కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అక్టోబర్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సూపర్ హిట్ ‘సీటీమార్’ అందుబాటులోకి రానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ స్వెటర్ కాస్ట్ ఎంతంటే!