కొట్టు కొట్టు ఈలే కొట్టు.. ప్రపంచమే వినేటట్టు.. ‘సీటీమార్’..

కొట్టు కొట్టు ఈలే కొట్టు.. ప్రపంచమే వినేటట్టు.. ‘సీటీమార్’..

Seetimaarr Title Song: ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో, మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ.. ‘సీటీమార్’.. గోపిచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో.. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

Seetimaarr

మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది. ఫస్ట్‌లుక్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. బుధవారం ‘సీటీమార్’ టైటిల్ సాంగ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, రేవంత్, వరం కలిసి పాడారు.

కబడ్డీ క్రీడాకారులను తీర్చిదిద్దే క్రమంలో వారిలో స్ఫూర్తినింపే విధంగా సాగే ఈ పాట ఆద్యంతం అలరించేలా ఉంది. దిగంగ‌న సూర్య‌వంశీ, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌ చేస్తోంది.. ఏప్రిల్ 2న ‘సీటీమార్’ ప్రేక్షకులముందుకొస్తుంది..