Senior Actors : ‘తగ్గేదేలే’.. అంటున్న సీనియర్ హీరోలు..

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ.. యంగ్ జనరేషన్‌కి ఫిట్‌నెస్ లెసన్స్ చెప్తున్నారు 60 ప్లస్ సీనియర్ హీరోలు..

Senior Actors : ‘తగ్గేదేలే’.. అంటున్న సీనియర్ హీరోలు..

Senior Actors

Senior Actors: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ.. యంగ్ జనరేషన్‌కి ఫిట్‌నెస్ లెసన్స్ చెప్తున్నారు 60 ప్లస్ సీనియర్ హీరోలు. సీనియర్లం అని సైడ్ అయిపోకుండా.. సైడ్ క్యారెక్టర్లతో సరిపెట్టుకోకుండా.. మాకేం తక్కువ..? మేమెందులో తక్కువ అంటూ.. యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతున్నారు ఈ యంగ్ లుకింగ్ హీరోలు..

తన పర్సనాలిటీతో ఫస్ట్ నుంచి టాలీవుడ్ మన్మథుడు , ఫిట్‌నెస్ విషయంలో మస్య్కులర్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు నాగార్జున. 60 దాటినా లుక్ విషయంలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు సీనియర్ స్టార్. ప్రజెంట్ సీనియర్లలోఇంత హ్యాండ్సమ్ లుక్ మెయింటెన్ చేస్తోంది.. అన్‌డౌటెడ్‌లీ నాగార్జునే. ప్రజెంట్ ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న మూవీ కోసం పర్‌ఫెక్ట్ లుక్ కోసం పర్సనల్ ట్రెయినింగ్ తీసుకుంటూ ఇంకాస్త ఫిట్‌గా కనిపించడానికి తెగ వర్కౌట్స్ చేస్తున్నారు.

60 దాటినా వెంకీ కూడా .. తన లుక్‌లో ఏమాత్రం ఛేంజ్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫస్ట్ నుంచీ కాస్త మ్యాన్‌లీ హంక్ బాడీ మెయింటెన్ చేసే వెంకీ.. స్టిల్ ఇంకా అలానే కనిపిస్తున్నారు.
యాక్టివ్, యంగ్, ఫిట్ గురించి మాట్లాడుకుంటూ.. టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి గురించి మాట్లాడుకోకపోతే ఎలా..? 65 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే స్టెప్పులతో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ కోసం బాగా కష్టపడుతున్నారు. గ్లామర్‌ని, ఫిజిక్‌ని మెయింటెన్ చేస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్‌ని రోజురోజుకీ పెంచుకుంటున్నారు మెగాస్టార్.

సౌత్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ ఫిట్‌నెస్ గురించి చెప్పనక్కర్లేదు. దాదాపు 70 కి దగ్గరవుతున్న వయసులో కూడా ఇప్పటివరకూ ఏమాత్రం ఛేంజ్ లేకుండా జాగ్రత్తగా ఫిజిక్‌ని మెయింటెన్ చేస్తున్న రజనీకాంత్ ఫిట్‌నెస్ కోసం స్ట్రిక్ట్ డైట్‌తో పాటు యోగా కూడా మస్ట్‌గా చెయ్యాల్సిందే. మరో సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా తన స్లిమ్ అండ్ స్టన్నింగ్ లుక్ ని క్యారీ చేస్తున్నారు. 66 ఏళ్ల వయసున్న కమల్.. ఇప్పటికీ తన సినిమాల్లో ప్రయోగాలు చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్లలో సీనియర్ ఫిట్‌నెస్ అంటే అమితాబ్ తర్వాతే ఎవరైనా.. ఎలాంటి పరిస్థితిలో అయినా రోజూ ఎక్సర్‌సైజ్, యోగా చెయ్యకుండా ఉండని ఈ స్టార్ హీరో, యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. ఒకప్పటి రొమాంటిక్ హీరో అనిల్ కపూర్.. ఇప్పుడు కూడా అదే ఫిట్‌నెస్‌తో ఉన్నారు. పర్సనల్ ట్రెయినర్‌తో రన్నింగ్, స్కిప్పింగ్‌తో ఫిట్‌నెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా యంగ్ హీరోలతో డ్యాన్సులు చేస్తూ.. అవసరమైతే ఫైటింగ్‌లు కూడా చెయ్యడానికి రెడీ అంటున్నారు.

ఇక సంజయ్ దత్, సునీల్ శెట్టి కూడా అంతే. ‘కె.జి.యఫ్ 2’ కోసం సంజయ్ దత్ హల్క్ బాడీతో రెడీ అయ్యారు. ‘పానిపట్’ మూవీలో కూడా తన యాక్షన్ పవర్‌ని చూపించి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గేది లేదన్నారు. ఇప్పుడు ‘కె.జి.యఫ్ 2’ లో సూపర్బ్ బాడీతో హీరోకి పోటీ ఇస్తున్నారు సంజయ్ దత్. 60ఏళ్ల సునీల్ శెట్టి, ఇప్పుడు కూడా స్టిల్ ది సేమ్ ఫిజిక్, సేమ్ ఎనర్జీతో ఫిట్‌గా ఉన్నారు. ఇంకా హెవీ బాడీ బిల్డింగ్‌తో పాటు యోగా చేస్తూ.. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తున్నారు.