Senior Heros : పేరుకే సీనియర్ హీరోలు.. కానీ యువ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారుగా..

ఇప్పటి యువ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా గగనంగా చేస్తుంటే ఇలా 60 ఏళ్ళు దాటిన స్టార్ హీరోలంతా ఇప్పటికి కూడా వరుసగా సినిమాలని లైన్లో పెట్టి యువ హీరోలకి షాకిస్తున్నారు.............

Senior Heros : పేరుకే సీనియర్ హీరోలు.. కానీ యువ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారుగా..

Senior heroes are doing films consecutively

Senior Heros :  వారంతా వివిధ భాషల్లోని మెగాస్టార్స్. సినిమానే ఊపిరి. సినిమానే ప్రాణం. ఏజ్ ను కూడా లక్ష్యపెట్టకుండా సంవత్సరానికి రెండు, మూడు సినిమాల్ని చేసేస్తున్నారు. వారి ఎనర్జీ లెవెల్సే వేరు. మెగాస్టార్స్ ఆల్వేస్ మెగాస్టార్స్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు సీనియర్ హీరోలు.

ఫ్యాన్స్ విజిల్స్, క్లాప్స్ వినిపిస్తే తమ ఏజ్ ను కూడా లెక్కచెయ్యరు. వారి కోసం ఎన్ని సినిమాల్లో నటించినా తప్పులేదని, వారి అభిమానాన్ని ఇంకా ఇంకా సంపాదించాలని కోరుకుంటారు హీరోలు. కొంతమంది హీరోలు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు టార్గెట్ పెట్టుకుంటారు. ఏడాదికి ఒక సినిమాలో నటించడానికే మన యంగ్ హీరోలు కిందా మీదా పడిపోతున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు సీనియర్ హీరోలు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. వారి ఎనర్జీ లెవెల్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

 

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఆయన నాలుగు సినిమాల్ని ఒకేసారి పట్టాలెక్కించేశారు. 67 ఏళ్ళ వయసులో కూడా ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడమే తన ధ్యేయంగా రన్ మెషీన్ గా పనిచేస్తున్నారు చిరు. వాటిలో ‘ఆచార్య, గాడ్ ఫాదర్’ మూవీస్ రిలీజవగా ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య, భోళాశంకర్’ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఇవే కాక మరో రెండు సినిమాలు కూడా ఓకే చేశారు చిరంజీవి.

కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ విషయానికొస్తే.. ఆ ఇద్దరు కూడా ప్రస్తుతం రెండు సినిమాలకు తక్కువ కాకుండా నటిస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నారు. తలైవా రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లో ‘జైలర్’ మూవీలో నటిస్తుండగా, లేటెస్ట్ గా మరో రెండు సినిమాల్ని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఆ మూవీస్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. ఇక కమల్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ‘ఇండియన్ 2’ లో నటిస్తున్నారు. రీసెంట్ గా మణిరత్నం తో ఓ సినిమాను ప్రకటించారు. విక్రమ్ 2 కూడా త్వరలోనే ఉంటుందని చెప్పారు. ఇలా ఆయన కూడా వరుస సినిమాలని లైన్లో పెడుతున్నారు.

ఇక మలయాళంలో సీనియర్ స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి సైతం ఏడాదికి నాలుగు సినిమాలకు తక్కువగా నటించరు. మోహన్ లాల్ వయసు 62. ఈ ఏజ్ లో కూడా ఆయన సినిమాల్లో నటిస్తుండడం యంగ్ హీరోలకు ఇన్స్పిరేషన్. ప్రస్తుతం ఆయన ‘ఎలోన్, ఓలవుమ్ తీరవుమ్, బరోజ్, ఎంపురాన్’ లాంటి సినిమాలే కాకుండా ఇంకా టైటిల్ నిర్ణయించని సినిమాలు నాలుగున్నాయి. ఇక మమ్ముట్టి వయసు 71. అయినా సరే తన కొడుకు దుల్కర్ సల్మాన్ తో సినిమాల విషయంలో పోటీ పడుతుంటారు. తాజాగా మమ్ముట్టి నటించిన ‘రోషాక్’ మూవీ రిలీజైంది. ఆ తర్వాత ‘నన్ పగల్ నేరత్తు మయక్కం, క్రిష్టోఫర్, కడుగన్నవ ఒరు యాత్ర, బిలాల్’ అనే మూవీస్ లో నటిస్తున్నారు. వీటిలో మూడు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇలా మలయాళ సీనియర్ హీరోలు కూడా వరుస సినిమాలని పట్టాలెక్కిస్తున్నారు.

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సీనియర్ హీరోల్లో ముందుగా చెప్పుకోవల్సిన పేరు అమితాబ్ బచ్చన్. ఆయన ఏజ్ 80. అయినా సరే మిగతా హీరోలు షాకయ్యేలా ప్రెజెంట్ ఆయన సినిమాల లిస్ట్ ఉంది. రీసెంట్ గా ‘గుడ్ బై’ సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన అమితాబ్ .. నెక్స్ట్ ‘ఊంచల్, గణపత్, ది ఉమేష్ క్రానికల్స్, ప్రాజెక్ట్ కె’ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాల్లో క్యామియో అపీరెన్స్ చేస్తున్నారు. మరోపక్క కౌన్ బనేగా కరోడ్ పతి షో కూడా నడిపిస్తున్నారు. ఆయన ఏజ్ కి, ఆయన కష్టపడేదానికి సంబంధమే లేదు. ఆయన్ని చూసి యువ హీరోలు చాలా నేర్చుకోవాలి.

Akshay Kumar : బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు.. ఇక వరుస సీక్వెల్స్.. ఇప్పుడైనా హిట్ కొడతాడా అక్షయ్

ఇప్పటి యువ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా గగనంగా చేస్తుంటే ఇలా 60 ఏళ్ళు దాటిన స్టార్ హీరోలంతా ఇప్పటికి కూడా వరుసగా సినిమాలని లైన్లో పెట్టి యువ హీరోలకి షాకిస్తున్నారు. మరి వీళ్ళని చూసి యువ హీరోలు ఇంత ఫాస్ట్ గా సినిమాలు చేయాలని ఎప్పుడు నేర్చుకుంటారో