Serial Artist : లైంగిక వేధింపుల కేసులో సీరియల్ నటుడు అరెస్ట్
తాజాగా ఓ సీరియల్ నటుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. టీవీ సీరియల్లో నటించే ఎం సుమన్ కుమార్ అనే నటుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ అమ్మాయిని.................

Serial Artist : ఇటీవల లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యంగా బయటకి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఇందులో సాధారణ అమ్మాయిల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఉన్నారు. ఇక లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిలో కూడా సాధారణ అబ్బాయిల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మందే ఉన్నారు. తాజాగా ఓ సీరియల్ నటుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు.
Balakrishna : హాస్పిటల్‌లో బాలయ్య.. మోకాలికి ఆపరేషన్.. ఆందోళనలో అభిమానులు..
ఒడియా టీవీ సీరియల్లో నటించే ఎం సుమన్ కుమార్ అనే నటుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ అమ్మాయిని నమ్మించాడు. గత రెండు సంవత్సరాలుగా ఆ అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని అడుగుతుంటే పట్టించుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఒడిశా పోలీసులు ఆ సీరియల్ నటుడు సుమన్ కుమార్ ని భువనేశ‍్వర్‌లో అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని అతడిపై ఐపీసీ సెక్షన్ 376 (2) (ఎన్), 420, 294, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.