7 Bypolls Today: 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతోన్న పోలింగ్.. ఈ ఉప ఎన్నికలకు కారణాలేంటో తెలుసా?

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అర్వింద్ గిరి మరణంతో లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోరఖ్‭నాథ్ అసెంబ్లీ నియోజవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానంలో బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బిహార్‭లోని గోపాల్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజీపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానంలో బీజేపీని ఆర్జేడీ ఢీ కొడుతోంది

7 Bypolls Today: 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతోన్న పోలింగ్.. ఈ ఉప ఎన్నికలకు కారణాలేంటో తెలుసా?

Seven bypolls today, Do you know the reasons for this by-election?

7 Bypolls Today: దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక గురువారం కొనసాగుతోంది. తెలంగాణలోని మునుగోడు, మహారాష్ట్రలోని తూర్పు అంధేరి, హర్యానాలోని అదాంపూర్, ఉత్తరప్రదేశ్‭లోని గోలా గోరఖ్‭నాథ్, బిహార్‭లోని గోపాల్ గంజ్ & మొకమ, ఒడిశాలొని ధాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతోన్న పోలింగ్.. దాదాపు ముగింపు దశకు వస్తోంది.

ముంబైలోని ఈస్ట్ అంధేరిలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ప్రధాన పోటీదారుగా ఉంది. ఈ స్థానం ఎమ్మెల్యేగా గెలుపొందిన శివసేన నేత రమేశ్ లాక్టే మరణించడంతో ఉప ఎన్నిక ఏర్పడింది. ప్రస్తుతం పోటీలో ఆయన భార్య రుతుజ పోటీలో ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీలన్ని పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే కొంత మంది స్వతంత్ర్య అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక తెలంగాణలోని మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక ఏర్పడింది. ఎమ్మెల్యే రాజీనామా అనంతరం ఆయన బీజేపీలో చేరి, ప్రస్తుతం కమలం గుర్తు నుంచి బరిలోకి దిగారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అర్వింద్ గిరి మరణంతో లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోరఖ్‭నాథ్ అసెంబ్లీ నియోజవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానంలో బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బిహార్‭లోని గోపాల్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజీపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానంలో బీజేపీని ఆర్జేడీ ఢీ కొడుతోంది. అయితే ఇదే స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది భార్య సాధు యాదవ్‭ను బీఎస్పీ రంగంలోకి దింపింది. దీంతో ఈ ఎన్నిక ఆర్జేడీకి చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇక ఆర్జేడీ నేత అనంత్ సింగ్ మారణాయుదాల కేసులో తన సభ్యత్వాన్ని కోల్పోవడంతో మొకమ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానం నుంచి కూడా ఆర్జేడీ ప్రధాన పోటీదారుగా ఉంది.

ఒడిశాలోని ధాం నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే చరణ్ సేతి సెప్టెంబర్‭లో మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటులో బీజేపీనే ఫేవరెట్‭గా బరిలో ఉంది. హర్యానాలోని అదాంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయి పార్టీ మారారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు పిలుపునిచ్చారు.

Jharkhand CM Challenge To ED : ‘దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి’ అంటూ ఈడీకి ఝార్ఖండ్ సీఎం సవాల్