Vijay Babu : నాకు ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు.. హీరోపై మరో నటి లైంగిక వేధింపుల ఆరోపణలు..

తాజాగా మరో మహిళ అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ‘విమెన్‌ ఎగెనిస్ట్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో ఆ మహిళ విజయ్ బాబుతో తనకి జరిగిన ఓ చేదు అనుభవాన్ని............

Vijay Babu : నాకు ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు.. హీరోపై మరో నటి లైంగిక వేధింపుల ఆరోపణలు..

Vijay Babu

Vijay Babu :  మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌ బాబుపై ఇప్పటికే ఓ యువ నటిపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదు అయింది. మొదట దీనిపై నాకేం తెలీదు అంతా అబద్దం అంటూ స్పందించిన విజయ్ తర్వాత పరారీ అయ్యాడు. తాజాగా మరో మహిళ అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ‘విమెన్‌ ఎగెనిస్ట్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో ఆ మహిళ విజయ్ బాబుతో తనకి జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

ఆ మహిళ తాను సినిమాల్లో నటించడానికి చాలా ప్రయత్నాలు చేశానని ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఓ సారి విజయ్ ని కలిశానని తెలిపింది. విజయ్ గురించి చెప్తూ.. ”గతేడాది నవంబర్‌లో నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్‌ యజమాని విజయ్‌ బాబును కలిశాను. సినిమాకి సంబంధించిన విషయాల గురించే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య వ్యక్తిగతమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. నా పర్సనల్, ఫైనాన్సియల్ బాధలు చెప్పడంతో నాకు హెల్ప్‌ చేస్తానన్నాడు. నాకు తన సినిమాల్లో రోల్స్ ఇస్తా అన్నాడు. మా ఇద్దరితో పాటు గదిలో ఉన్న ఇంకో వ్యక్తి బయటకు వెళ్లిపోయాడు. విజయ్‌ బాబు మద్యం సేవిస్తూ నన్ను కూడా తాగమని అడిగారు”

Samantha : ప్రేమకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా

”ఆ సమయంలో రూంలో మేము ఇద్దరమే ఉన్నాం. అతను ఆల్కహాల్ ఆఫర్ చేయగా నేను వద్దన్నాను. అప్పుడు సడెన్ గా నా పెదాలపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. నేను వెంటనే అప్రమత్తమై అతడికి దూరంగా జరిగాను. అతడు మళ్ళీ ‘జస్ట్‌ వన్‌ కిస్‌’ అని అడిగాడు. నేను సీరియస్ గా నో చెప్పాను. తర్వాత నాకు సారీ చెప్పి ఈ విషయాన్ని బయట ఎవరితోనూ చెప్పొద్దని బతిమాలాడాడు. నేను కూడా సరే అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కూడా అతను నాతో చీప్ గా ప్రవర్తించాడు. అతడి చీప్ బిహేవియర్ నన్ను ఇండస్ట్రీలోకి రానివ్వకుండా చేసింది. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న నా కలకు అక్కడితోనే ఫుల్‌స్టాప్‌ పెట్టేశాను. ఇటీవల ఓ నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టిన వార్త చదివినప్పుడు నేనూ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకున్నాను. నా బాధను అందరితో పంచుకోవాలనుకొని ఇప్పుడు ఇలా చెప్తున్నాను” అంటూ పోస్ట్ చేసింది.