Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్‌ అవార్డు గ్రహీతపై కేసు..

 ప్రముఖ బ్రిటిష్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత కెవిన్ స్పేసీ పై లైంగిక దాడి కేసు నమోదైంది. 2005లో మీటూ ఉద్యమంలో భాగంగా ఆయనపై మొదటి సారి..................

Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్‌ అవార్డు గ్రహీతపై కేసు..

Kevin

Kevin Speacy :  ప్రముఖ బ్రిటిష్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత కెవిన్ స్పేసీ పై లైంగిక దాడి కేసు నమోదైంది. 2005లో మీటూ ఉద్యమంలో భాగంగా ఆయనపై మొదటి సారి లండన్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2008 అగష్టులో, 2013 ఏప్రిల్‌లో ఆయనపై మరో ముగ్గురు లైంగిక ఆరోపణలు చేశారు. ముగ్గురు పురుషులపై కెవిన్ నాలుగు సార్లు వేధింపులకు పాల్పడినట్టు ఇంగ్లాండ్ కి సంబంధించిన ద క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తెలిపింది.

Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..

ముగ్గురు పురుషులపై నాలుగు సార్లు లైంగిక​ దాడికి పాల్పడినట్టు కెవిన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా బ్రిటిన్‌ పోలీసులు ఈ లైంగిక దాడి ఆరోపణలు రుజువైనందున ఆయనపై చార్జ్‌షీట్‌ ఫైల్ చేశారు. కెవిన్ ఒక వ్యక్తిపై వేధింపులకు పాల్పడ్డాడని, మరో ఇద్దరు వ్యక్తులతో లైంగిక చర్యల్లో పాల్గొన్నాడని పోలీసులు తమ ఛార్జ్ షీట్‌లో తెలిపారు. ఇంగ్లీష్ చట్టాల ప్రకారం బాధితులను, వారి పేర్లను మీడియాకు వెల్లడించలేదు. పోలీసులు ఈ కేసుపై మరింత విచారణ చేయనున్నారు.