Pathaan ఫస్ట్ లుక్.. ఎయిట్ ప్యాక్‌తో కింగ్ ఖాన్ మెస్మరైజ్!

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కెరీర్ గతకొద్ది కాలంగా ఆశించిన స్థాయిలో లేదు. నటుడిగా, నిర్మాతగా ఎదురు దెబ్బలు తిన్నారు. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు.

Pathaan ఫస్ట్ లుక్.. ఎయిట్ ప్యాక్‌తో కింగ్ ఖాన్ మెస్మరైజ్!

Pathaan(1)

Pathaan: కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కెరీర్ గతకొద్ది కాలంగా ఆశించిన స్థాయిలో లేదు. నటుడిగా, నిర్మాతగా ఎదురు దెబ్బలు తిన్నారు. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఒకప్పుడు షారుఖ్ అంటే సక్సెస్ కు బ్రాండ్ అంబాసిడర్. షారుఖ్ ఉంటే చాలు కలెక్షన్ల సునామీ అనే టాక్ నడిచేది. అయితే కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన షారుఖ్ మళ్ళీ తిరిగి ఫామ్‌లోకి వస్తున్నాడు అనుకుంటుండగా.. కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టవడం ఊహించని విధంగా షాక్ తగిలింది.

Shah Rukh Khan: సొంత ఓటీటీతో ఎంట్రీ ఇస్తున్న షారుఖ్

ఆ తర్వాత ఆర్యన్ కేసులో బెయిల్ దొరకడం.. కొంత గ్యాప్ తరవాత షారుఖ్ మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. షారుఖ్ ప్రస్తుతం పఠాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతోంది. అక్కడ దీపికా పదుకొణె, షారుఖ్‌లకు సంబంధించిన కీలక సన్నీవేశాలను షూట్ చేస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా లీకయ్యాయి. కాగా ఇప్పుడు స్వయంగా షారుఖ్ ఖాన్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ రిలీవ్ చేశాడు. సోషల్ మీడియాలో షారుఖ్ పోస్ట్ చేసిన లుక్ పోస్టర్ లో ఎయిట్-ప్యాక్ అబ్స్, పొడవాటి జుట్టుతో కింగ్ ఖాన్ మెస్మరైజ్ చేశాడు.

Shah Rukh Khan: తొలగిన కష్టాలు.. మళ్ళీ జోష్‌లో షారుఖ్!

షారుఖ్ నుండి మూడేళ్ళ సుదీర్ఘ‌ విరామం త‌ర్వాత వస్తున్న సినిమా కావ‌డం, దీపికా ప‌దుకొనే, జాన్ అబ్ర‌హాంలతో పాటు సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ తో రానున్న పఠాన్ మూవీ కోసం బాద్ షా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో షారుఖ్ వదిలిన ఫస్ట్ లుక్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను డబుల్ చేసింది. ఆరు పదుల వయసుకు దగ్గరవుతున్న షారుఖ్ బాడీ ఫిట్నెస్, ఎయిట్ ప్యాక్ తో యంగ్ హీరోలకు పోటీ ఇస్తుండడం ఇప్పుడు ఆయన అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)