Shahrukh Khan : బాలీవుడ్ ‘బాద్‌షా’.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ..

షారుఖ్ ఒక బ్రాండ్.. బాలీవుడ్‌కు బాద్‌షా అని పేరు తెచ్చుకున్న ఏకైక హీరో..

Shahrukh Khan : బాలీవుడ్ ‘బాద్‌షా’.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ..

Shahrukh Khan

Shahrukh Khan: వరుస డిజాస్టర్లు.. సినిమా సినిమాకు గ్యాప్.. ఇవేవి షారుఖ్ ఖాన్ అంటే అభిమానులకు ప్రేమను తగ్గించలేక పోతున్నాయి. సినిమాలు చేయకపోయినా సరే షారుఖ్ ఎప్పుడూ బాలీవుడ్ బాద్‌షానే.. కింగ్ ఆఫ్ ఖాన్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ అభిమానం వల్లే షారుఖ్ 29 ఏళ్ల సినిమా ప్రస్థానాన్ని దాటుకుని 30లోకి అడుగు పెట్టారు.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 30 ఏళ్ల మూవీ కెరీర్‌లోకి అడుగు పెట్టారు. ఈ మధ్య వరుస డిజాస్టర్లు ఖాన్‌ను డిస్ట్రబ్ చేస్తున్నా.. ఆయన ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. ‘జీరో’ సినిమాతో భారీ ఫ్లాప్ అందుకున్న షారుఖ్ ఆ తరువాత రెండేళ్ళ పాటు సినిమాల ఊసులేకుండా ఇంటికే పరిమితం అయ్యారు. లాంగ్ గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకున్న బాద్‌షా ఇప్పుడు వరుసగా సినిమాలతో బాక్సాఫీస్ వార్‌కు రెడీ అయ్యారు.

‘జీరో’ సినిమా డిజాస్టర్ తరువాత గ్యాప్ ఇచ్చిన షారుఖ్ ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ‘పటాన్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ రా ఏజెంట్‌గా పర్ఫార్మెన్స్‌ బేస్డ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈసారి అభిమానులను నిరాశపరచకుండా.. విజువల్ ట్రీట్‌కు బాద్‌షారెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ‘లాల్ సింగ్ చద్దా’ లాంటి మరికొన్ని సినిమాలలో గెస్ట్ రోల్‌లో మెరవబోతున్నారు షారుఖ్.

షారూఖ్‌ తన కెరీర్‌లో ప్రయోగాలకు పెద్ద పీటవేశారు. ఫెయిల్యూర్స్‌కు భయపడకుండా.. సినిమాలు చేసుకుంటూ వెళ్లి.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ‘పర్‌దేశ్‌, డీడీఎల్‌జే, దేవదాస్‌, కల్‌హోనా హో, వీర్‌జరా, చక్‌దే ఇండియా’ లాంటి పర్ఫార్మెన్స్‌ బేస్డ్‌ సినిమాలే కాకుండా.. ‘దిల్‌ సే, అశోక, ఛల్తే ఛల్తే, స్వదేశ్‌, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌, రా వన్‌, ఫ్యాన్‌, రాయిస్‌’ లాంటి ప్రయోగాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ మిగిల్చినప్పటికీ.. షారూఖ్‌ యాక్టింగ్‌కు ఆడియెన్స్‌ను ఫిదా చేయకుండా ఉండలేకపోయాయి

షారుఖ్ ఒక బ్రాండ్.. బాలీవుడ్‌కు బాద్‌షా అని పేరు తెచ్చుకున్న ఏకైక హీరో. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. సెకండ్ హీరోగా 1992లో ‘దివానా’ సినిమాతో తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఖాన్.. తన నటన, స్టైల్.. అభిమానులను రిసీవ్ చేసుకునే పద్ధతి… ఇలా చాలా కారణాల వల్ల బాలీవుడ్‌ను ఏలగలిగాడు. మొదట్టో నెగెటివ్ రోల్స్‌కే పరిమితం అయిన షారుక్ ఆ తర్వాత లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా దాదాపు 15 ఏళ్ళ పైనే బాలీవుడ్‌ను ఏలాడు.