Shahrukh Khan : 57 ఏళ్ళ వయసులో సిక్స్ ప్యాక్‌తో అదరగొడుతున్న షారుఖ్..

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ పఠాన్ టీజర్ రిలీజ్ అయ్యింది. హైలీ టెక్నికల్ వాల్యూస్ తో పాటు అమేజింగ్ యాక్షన్ సీన్స్ తో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకున్నది షారూఖ్ ఖాన్ లుక్, స్పెషల్లీ సిక్స్ ప్యాక్ బాడీ. టీజర్ లో పూర్తిగా చూపించకపోయినా...........

Shahrukh Khan : 57 ఏళ్ళ వయసులో సిక్స్ ప్యాక్‌తో అదరగొడుతున్న షారుఖ్..

Shahrukh Khan maintaining six pack body in 57 years old

Shahrukh Khan :  రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ పఠాన్ టీజర్ రిలీజ్ అయ్యింది. హైలీ టెక్నికల్ వాల్యూస్ తో పాటు అమేజింగ్ యాక్షన్ సీన్స్ తో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకున్నది షారూఖ్ ఖాన్ లుక్, స్పెషల్లీ సిక్స్ ప్యాక్ బాడీ. టీజర్ లో పూర్తిగా చూపించకపోయినా పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేశాడని తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం పఠాన్ షూటింగ్ నుంచి షారుఖ్ సిక్స్ ప్యాక్ బాడీ ఫోటో కూడా లీక్ అయింది.

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇంతకముందు చాలా సార్లు సిక్స్ ప్యాక్ బాడీ చూపించారు. కానీ ఇప్పుడు 57 ఏళ్ల వయసులో షారూఖ్ సిక్స్ ప్యాక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. 4 ఏళ్ల గ్యాప్ వచ్చినా కూడా స్క్రీన్ ప్రజెన్స్ లో ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా కనిపించడానికి షారూఖ్ తన ఫిజిక్ మీద చాలా కాన్సన్ ట్రేట్ చేశారు. అందుకే పఠాన్ టీజర్ లో షారూఖ్ కటౌట్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు ఫాన్స్.

సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పఠాన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 200కోట్ల బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం షారూఖ్ 6 ప్యాక్ చేశారు. ఈ ఫిట్ నెస్ కోసం కోవిడ్ టైమ్ నుంచి ట్రై చేస్తున్న షారూఖ్ సిక్స్ ప్యాక్ కోసం బాలీవుడ్ లో ఫిట్ నెస్ ఫ్రీక్స్, సిక్స్ ప్యాక్ స్పెషలిస్ట్ లు అయిన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నుంచి కూడా టిప్స్ తీసుకున్నారట. తన సిక్స్ ప్యాక్ కోసం సపరేట్ గా ట్రైనర్స్ ని పెట్టుకొని మరీ వర్కౌట్ చేశాడు షారుఖ్.

Young Heros : నిర్మాతలుగా మారుతున్న యువ హీరోలు..

లాక్ డౌన్ నుంచి తన బాడీని టోన్ చేసుకునే పనిలోనే ఉన్న షారూఖ్ పఠాన్ కోసం ఇంటెన్స్ వర్కవుట్ చేశారు. హై ఎలివేటెడ్ యాక్షన్ సీన్స్ కోసం ఫిజికల్ గా షారూఖ్ ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారంటున్నారు డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్. బాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలున్నా షారూఖ్ స్టైల్ ని, రొమాంటిక్ హీరో అన్న ట్యాగ్ ని ఎవ్వరూ ఓవర్ కమ్ చెయ్యలేరు. 57 ఏళ్ల వయసులో కూడా ఇంకా తన ఫిజిక్ తో, పర్ఫామెన్స్ తో, అల్టిమేట్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నారు షారూఖ్. టీజర్ లో జస్ట్ ఒక్క నిమిషం చూపిస్తేనే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారంటే ఇంక ఫుల్ సినిమాలో షారుఖ్ సిక్స్ ప్యాక్ తో ఇంకెన్ని విన్యాసాలు చేసాడో అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జనవరి 25న రిలీజ్ కానుంది.