‘షకీలా’ ట్రైలర్: సూపర్‌ స్టార్‌గా ఎదిగిన పోర్న్ స్టార్..

‘షకీలా’ ట్రైలర్: సూపర్‌ స్టార్‌గా ఎదిగిన పోర్న్ స్టార్..

Shakeela: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కొంతకాలంగా రీమేక్స్, బయోపిక్స్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యానికి సంబంధించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చిన్న క్యారెక్టర్‌తో సినీ రంగప్రవేశం చేసి, తన నటనతో, అంద చందాలతో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్ని అలరించి, దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి, బిగ్రేడ్ నటి స్థాయి నుంచి స్టార్‌గా ఎదిగిన సెక్స్ బాంబ్ షకీలా బయోపిక్ వెండితెరపైకి రానుంది.

Shakeela

 

రిచా చద్దా షకీలా పాత్రలో కనిపించనుండగా.. పంకజ్ త్రిపాఠి, ఎస్తేర్ నోరోన్హా, షీవా రానా, రాజీవ్ పిళ్లై కీలకపాత్రల్లో నటించారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. బుధవారం ‘షకీలా’ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Shakeela

సిల్క్ స్మిత ఆత్మహత్యతో మొదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఆమె తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలానే అని చూపించారు. షకీలా బాల్యం, విద్య, కుటుంబ పోషణకై సిటీకి వచ్చి సినిమాల్లో నటించడం.. పోర్న్ స్టార్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సూపర్‌స్టార్‌గా మారడం వంటివి ట్రైలర్‌లో చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. షకీలా క్యారెక్టర్‌లో రిచా ఆకట్టుకుంది. ఆర్ ఆర్, విజువల్స్ బాగా కుదిరాయి. డిసెంబర్ 25న ‘షకీలా’ థియేటర్లలోకి రానుంది.