Sharkbot Malware: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక.. ఆ యాప్స్ డిలీట్ చేయకుంటే అంతే!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడేవారికి హెచ్చరిక. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. లేకుంటే మీ డేటా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. ఈ విషయంపై గూగుల్ సంస్థ తాజాగా చేసిన సూచనలివే.

Sharkbot Malware: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక.. ఆ యాప్స్ డిలీట్ చేయకుంటే అంతే!

Sharkbot Malware: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే జాగ్రత్త. మీ ఫోన్‌లోని సమాచారం మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంపై గూగుల్, బిట్ డిఫెండర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థలు యూజర్లకు పలు సూచనలు చేశాయి.

Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు

తాజా సూచనల ప్రకారం.. ఆండ్రాయిడ్ ఫోన్లకు షార్క్‌బాట్ అని పిలిచే మాల్‌వేర్ ముప్పు పొంచి ఉంది. ప్లే స్టోర్‌లో ఉన్న ఆరు యాప్‌ల ద్వారా షార్క్‌బాట్ మాల్‌వేర్ స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోంది. ఎక్స్-ఫైల్ మేనేజర్, ఫైల్ వోయోజర్, ఫోన్ ఎయిడ్, క్లీనర్, బూస్టర్ 2.6, లైట్ క్లీనర్ ఎమ్ అనే ఆరు యాప్స్ ద్వారా షార్క్‌బాట్ మాల్‌వేర్ స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోంది. అందువల్ల ఈ యాప్స్‌ను యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయాలని సూచించింది. అయితే, ఇది గమనించే లోపే చాలా మంది యూజర్లు వీటిని తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఒకవేళ ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే వీటిని డిలీట్ చేయాలి. యూజర్లు వీటిని డిలీట్ చేయడంతోపాటు, తమ ఇతర యాప్స్‌కు సంబంధించిన పాస్ వర్డ్స్, యూజర్ నేమ్స్ మార్చుకోవాలి.

PM Modi: సిరిసిల్ల నేత కార్మికుడికి ప్రధాని ప్రశంస.. ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన మోదీ.. కారణం ఏంటంటే..

ఈ యాప్స్‌ను గూగుల్ ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది. ఈ యాప్స్ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ల బ్యాంకింగ్ వివరాలు, ఇతర యాప్స్ వివరాల్ని ఆయా సంస్థలు సేకరిస్తున్నాయి. ఈ యాప్స్ బారి నుంచి తప్పించుకోవాలంటే యూజర్లు ప్లే ప్రొటెక్ట్ సర్వీస్‪ను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే ఆండ్రాయిడ్ యాంటీ వైరస్ యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడే యూజర్ల డేటాకు రక్షణ ఉంటుంది.