Sharwanand : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సిద్దార్థ్, అదితి రావు హైదరీ రిలేషన్ గురించి మాట్లాడిన శర్వానంద్

షోలో బాలయ్య బాబు హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ అదితి రావు హైదరి గురించి అడగగా తను సిద్దార్థ్ పెయిర్ నాకు కాదు అన్నాడు. అంటే నిజమేనా అని బాలయ్య బాబు అడిగాడు. మహా సముద్రం సినిమాలో సర్. బయట నాకు తెలీదు, రీసెంట్ గానే...........

Sharwanand : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సిద్దార్థ్, అదితి రావు హైదరీ రిలేషన్ గురించి మాట్లాడిన శర్వానంద్

Sharwanand comments on Siddarth and adithi rao hydari relation

Sharwanand :  బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. సిద్దార్థ్, అదితిరావు హైదరీలు ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. ఇటీవల అదితి పుట్టినరోజు నాడు సిద్దార్థ్ అదితిని హగ్ చేసుకున్న ఫోటో పోస్ట్ చేసి స్పెషల్ విషెస్ చెప్పాడు. దీంతో వీరి రిలేషన్ పై మరిన్ని వార్తలు వచ్చాయి. తాజాగా అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన శర్వానంద్ వీరి రిలేషన్ గురించి మాట్లాడాడు. శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరీలు కలిసి మహా సముద్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Balakrishna : బాలయ్య మీద రూమర్స్ రాసే దమ్ముందా?? అన్‌స్టాపబుల్ లో బాలయ్య వ్యాఖ్యలు..

షోలో బాలయ్య బాబు హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ అదితి రావు హైదరి గురించి అడగగా తను సిద్దార్థ్ పెయిర్ నాకు కాదు అన్నాడు. అంటే నిజమేనా అని బాలయ్య బాబు అడిగాడు. మహా సముద్రం సినిమాలో సర్. బయట నాకు తెలీదు, రీసెంట్ గానే ఓ పోస్ట్ పెట్టాడు మై హార్ట్ అని మరి ఏమో అన్నాడు శర్వా. నీకు తెలియకుండా ఉంటుందా, సిద్దార్థ్ కి అదితి పడిపోయిందా అని బాలయ్య బాబు శర్వాని దిగడంతో పడిపోయినట్టే అనుకుంట సర్ అని శర్వా క్లారిటీ ఇచ్చాడు. దీంతో మరోసారి సిద్దార్థ్, అదితి రావు హైదరి రిలేషన్ వైరల్ గా మారింది. శర్వానంద్ చెప్పిన దాన్ని బట్టి వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు వాళ్లిద్దరూ మాత్రం వారిపై వస్తున్న ఇలాంటి వార్తలపై స్పందించలేదు.