Sharwanand : ఫ్లైట్‌లోంచి దూకేశాను.. చేతికి రెండు ప్లేట్స్, కాలికి ఒక ప్లేట్ పడ్డాయి.. రెండున్నరేళ్లు పట్టింది కోలుకోవడానికి..

షోలో శర్వానంద్ తనకు జరిగిన ఓ బ్యాడ్ సంఘటనని షేర్ చేసుకున్నాడు. జాను సినిమా సమయంలో జరిగిన యాక్సిడెంట్ గురించి వివరించాడు. శర్వానంద్ దీని గురించి మాట్లాడుతూ.................

Sharwanand :  ఫ్లైట్‌లోంచి దూకేశాను.. చేతికి రెండు ప్లేట్స్, కాలికి ఒక ప్లేట్ పడ్డాయి.. రెండున్నరేళ్లు పట్టింది కోలుకోవడానికి..

Sharwanand shares about his accident while janu movie time

Sharwanand :  బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. అయితే షోలో శర్వానంద్ తనకు జరిగిన ఓ బ్యాడ్ సంఘటనని షేర్ చేసుకున్నాడు. జాను సినిమా సమయంలో జరిగిన యాక్సిడెంట్ గురించి వివరించాడు. శర్వానంద్ దీని గురించి మాట్లాడుతూ.. ”జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ బాగా హిట్ అయింది. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో ఫ్లైట్ నుంచి కిందకి దూకి స్కై డైవింగ్ చేయాలి. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాను. షూట్ రోజు 15000 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్ నుంచి దూకేశాను. కింద వరకు వచ్చేసాకా పారాచూట్ పని చేయలేదు. దీంతో కింద పడ్డాను. ఆపరేషన్ అయి రైట్ సైడ్ చేతికి రెండు ప్లేట్స్, 24 నట్లు పడ్డాయి. రైట్ సైడ్ కాలికి ఒక ప్లేట్ పడింది.”

Sharwanand : మీ ఆస్తుల లిస్ట్ అంతా మా దగ్గర స్కాన్ కాపీలు ఉన్నాయి.. బాలయ్యకి కౌంటర్ ఇచ్చిన శర్వానంద్..

”దాని నుంచి కోలుకోవడానికి రెండున్నరేళ్లు పట్టింది. అందరి ప్రార్థనల వల్ల, దేవుడి దయవల్ల కోలుకోగలిగాను. అన్నయ్య, నాన్న, ఫ్రెండ్స్ హాస్పిటల్ లో నా దగ్గరుండి చూసుకున్నారు. అసలు కోలుకుంటాను అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇలా ఉన్నాను. ఆ సంఘటన మాత్రం మర్చిపోలేను” అని ఎమోషనల్ అయ్యాడు. బాలకృష్ణ కూడా గతంలో నాకు ఇలాగే జరిగింది. పవిత్ర ప్రేమ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో బాంబ్ బ్లాస్ట్ ఉంటే దానివల్ల నాకు కూడా ఎఫెక్ట్ అయిందని తెలిపారు.