She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు she teams recieved many complaints

She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు

పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 423 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు

She Teams: పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 423 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 203 ఫిర్యాదులను బాధిత మహిళలు నేరుగా చేయగా, వాట్సాప్ ద్వారా 181 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు 57 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 25 మందిపై పిటీ కేసులు నమోదు చేశారు.

Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్.. ఆందోళనలో అభ్యర్థులు

బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న 52 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 191 మంది యువకులతోపాటు, 23 మంది మైనర్‌లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల సినిమాల్లో అవకాశాల పేరుతో ఒక యువతిని నిర్మాత వేధించడంతో, ఆమె షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. స్పందించిన గోల్కొండ పోలీసులు నిర్మాతను అరెస్టు చేశారు.

×