Shimla Minimum Temperature: అత్యల్ప ఉష్ణోగ్రతలకు చేరుకున్న సిమ్లా

సిమ్లా ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. శనివారం మెర్క్యూరీ లెవల్ -2.1కి చేరినట్లు ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.

Shimla Minimum Temperature: అత్యల్ప ఉష్ణోగ్రతలకు చేరుకున్న సిమ్లా

21 Freeze To Death In Cars Stranded In Snow

Shimla Minimum Temperature: సిమ్లా ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. శనివారం మెర్క్యూరీ లెవల్ -2.1కి చేరినట్లు ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో చలి తీవ్రంగా మారింది. లాహౌల్ స్పితి జిల్లాలోని కీలంగ్ లో ఉష్ణోగ్రత -12.5 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది.

ఆపిల్ పండ్లకు ఫ్యామస్ అయిన కిన్నౌర్ జిల్లాలో మైనస్ 7డిగ్రీల కంటే తక్కువకు పడిపోగా మనాలిలో -4.4డిగ్రీల సెల్సియస్ కు చేరింది. 2022 ఫిబ్రవరి 6నుంచి వెస్టరన్ హిమాలయా ప్రాంతం మరింతగా ప్రతికూల వాతావరణం ఎదుర్కోనుంది ఐఎండీ డేటా చెప్తుంది.

గడిచిన 24గంటల్లో టూరిస్ట్ స్పాట్ కుఫ్రీలో 60సెంటిమీటర్ల మేర మంచుతో నించిపోయింది. రాష్ట్రంలో చోపాల్ ప్రాంతంలో 45.7 సెంటిమీటర్ల ఎత్తులో మంచు కురుస్తుండగా.. సిమ్లాలో 32.6సెంటిమీటర్లు మంచు కురిసింది.

Read Also: విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి

అత్యధికంగా మంచు కురుస్తుండటంతో టూరిస్టులకు ముందస్తు సూచనలు ఇస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ పోలీసులు. పలు రోడ్లు అత్యధిక మంచుపాతం కారణంగా క్లోజ్ చేశారు కూడా.