Sanjay Raut Judicial Custody: 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఎంపీ సంజయ్ రౌత్
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కస్టడీలో ఉన్నంత కాలం సంజయ్ రౌత్ అనారోగ్యానికి వాడే ఔషధాలను ఆయనకు అందించాలని చెప్పింది. పాత్రా చాల్ (భవన సముదాయం) కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న విషయం తెలిసిందే.

Sanjay Raut sent to judicial custody
Sanjay Raut Judicial Custody: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కస్టడీలో ఉన్నంత కాలం సంజయ్ రౌత్ అనారోగ్యానికి వాడే ఔషధాలను ఆయనకు అందించాలని చెప్పింది. పాత్రా చాల్ (భవన సముదాయం) కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న విషయం తెలిసిందే.
ఈడీ కస్టడీని ఆగస్టు 8 వరకు న్యాయస్థానం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం నేటితో ముగిసింది. దీంతో ఆయనను నేడు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది. పాత్రా చాల్ కేసులో ఈడీ ఇప్పటికే కీలక వివరాలు రాబట్టింది. ఇదే కేసులో సమన్లు అందుకున్న సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ఇప్పటికే ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని రూ.11.50 లక్షలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
పాత్రా చాల్ భూ కుంభకోణానికి (రూ.1,000 కోట్లు) సంబంధించి ఇప్పటికే సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుని విచారించింది. కేంద్ర సర్కారు విపక్ష పార్టీలకు వేధించేందుకు ఈడీతో దాడులు చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సమయంలో సంజయ్ రౌత్‌పై విచారణ ముమ్మరంగా కొనసాగుతుండడం గమనార్హం.
Freedom Fighters: బ్రిటీష్ పాలకులను తమ పోరాటాలతో తరిమికొట్టిన ప్రముఖుల్లో కొందరు