Condoms In School Bags : షాకింగ్.. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, వైట్నర్లు, మద్యం

స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, వైట్నర్లు, డబ్బు చూసి టీచర్లు నిర్ఘాంతపోయారు. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

Condoms In School Bags : షాకింగ్.. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, వైట్నర్లు, మద్యం

Condoms In School Bags : స్కూల్ కి వెళ్లే పిల్లల బ్యాగుల్లో ఏముంటాయి అంటే.. వారి క్లాస్ పుస్తకాలు, పెన్నులు అని చెబుతారు. ఇది చాలా కామన్. ఇదసలు అడగాల్సిన ప్రశ్నే కాదని మీరు అడగొచ్చు. నిజమే, మీకొచ్చిన డౌట్ కరెక్టే. కానీ, స్కూల్ కి వెళ్లే పిల్లల బ్యాగుల్లో క్లాస్ పుస్తకాలు కాకుండా.. కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఏంటి షాక్ అయ్యారా? దిమ్మతిరిగిపోతోందా? కానీ, ఇది నిప్పులాంటి నిజం.

బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 8,9,10వ తరగతి చదివే విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు కనిపించాయి. విద్యార్థులు తరగతి గదుల్లో సెల్ ఫోన్లు వాడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో టీచర్లు విద్యార్థుల బ్యాగులు చెక్ చేశారు. వారి బ్యాగుల్లో అంతకుమించి వస్తువులు కనిపించడం బిత్తరపోయేలా చేసింది.

Also Read : Exotic animals: బ్యాగులో మూగ జీవాల స్మగ్లింగ్.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. పాపం ఎలా తీసుకొస్తున్నారో చూడండి!

విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, వైట్నర్లు, క్యాష్ చూసి టీచర్లు నిర్ఘాంతపోయారు. కొంతమంది పిల్లల వాటర్ బాటిల్స్ లో తాగే నీరు కాకుండా మద్యం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యాలు వెంటనే అలర్ట్ అయ్యాయి. ఆ పిల్లలపై చర్యలు తీసుకోవడానికి బదులుగా.. వారి తల్లిదండ్రులను పిలిపించి మీటింగ్ పెట్టారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.

విద్యార్థులు.. తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్లు తీసుకొస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దాంతో అలర్ట్ అయిన కర్నాటక విద్యాశాఖ అధికారులు.. స్కూళ్లలో విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైస్కూల్‌ విద్యార్థుల బ్యాగులు చెక్ చేశారు. తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకొస్తున్నారనే కంప్లైంట్స్ వస్తుండటంతో.. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని స్కూళ్ల యాజమాన్యాలను కర్నాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (కేఏఎంఎస్‌) ఆదేశించింది. ఈ తనిఖీల్లో ఒక విద్యార్థి బ్యాగ్ లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ-పిల్‌) లభించాయని, అలాగే వాటర్‌ బాటిల్‌లో మద్యం దొరికిందని కేఏఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి శశికుమార్‌ వెల్లడించారు.

ఆకస్మిక తనిఖీల తర్వాత స్కూళ్ల యాజమాన్యాలు.. వెంటనే పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి. బ్యాగుల్లో కండోమ్స్ గురించి వారికి చెప్పారు. విషయం తెలిసి స్కూల్ యాజమాన్యాలే కాదు.. తల్లిదండ్రులు కూడా నివ్వెరపోయారు. తమ పిల్లలు ఇలాంటి పని చేస్తున్న విషయం తమకే తెలియదన్నారు.

Also Read : Snake In Student Bag: బాబోయ్.. విద్యార్థి బ్యాగులో పాము.. ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే.. వీడియో వైరల్

ఇప్పుడీ ఘటన కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చక్కగా స్కూల్ కి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు ఇలా తయారయ్యారేంటి? అని అంతా వర్రీ అవుతున్నారు. ఇలాంటి పరిణామం మంచిది కాదని, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అనేదానిపై నిరంతర నిఘా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు.