Fish Rain : తెలంగాణలో వింత.. మళ్లీ చేపల వర్షం, ఆశ్చర్యంలో జనం

ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఇప్పుడు ఖమ్మం, జగిత్యాలలోనూ అదే సీన్ కనిపించింది.

Fish Rain : తెలంగాణలో వింత.. మళ్లీ చేపల వర్షం, ఆశ్చర్యంలో జనం

Fish Rain

Fish Rain : వర్షాకాలం వస్తే వానలు పడటం, వరదలు రావడం కామన్. అప్పుడప్పుడు వడగళ్లు పడటం సర్వ సాధారణం. కానీ, వీటికి భిన్నంగా వింతగా కొన్నిసార్లు చేపల వర్షం కూడా కురుస్తోంది. అవి కూడా మబ్బుల్లో నుంచి చినుకుల్లా రాలి నేల మీద పడతాయి. ఈ వింత చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఇప్పుడు ఖమ్మం, జగిత్యాలలోనూ అదే సీన్ కనిపించింది.

అటు జగిత్యాలలోనూ వింత ఘటన జరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల చేపల వాన కురిసింది. సాయినగర్ కాలనీలో వర్షంతో పాటు చేపలు నేల మీద పడ్డాయి. ఆ చేపలను చూసి స్థానికులు నివ్వెరపోయారు. అధిక బరువున్న చేపలను కొందరు తమ ఇళ్లకు తీసుకెళ్లారు.

Kaleshwaram Fish Rain : కాళేశ్వరంలో కలకలం.. భయంకరమైన ఆకారంలో చేపల వర్షం.. భయాందోళనలో జనం

కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కరీంనగర్-జగిత్యాల బైపాస్ రోడ్డుపై వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. అటు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో పాటు చేపలు కొట్టుకొస్తున్నాయి. దీంతో చేపలు పట్టుకునేందుకు జనాలు తరలి వస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో తరుచూ ఈ వింత ఘటన చోటు చేసుకుంది. వర్షపు చినుకులతో పాటు చేపలు పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. జులై 5న కాళేశ్వరంలో వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు కూడా పడ్డాయి. ప్రాణంతో ఉన్న వాటిని కొందరు ఇళ్లకు తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనే జూన్ 20న కూడా చోటు చేసుకుంది. మహదేవ్ పూర్ మండలంలో అటవీ ప్రాంతంలో చేపల వర్షం కురిసింది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలు కనిపించడంతో వాటిని పట్టుకున్నారు. చేపల వర్షం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకిలా జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పైనుంచి చేపలు కింద పడటం ఒక ఆశ్చర్యం కలిగించే అంశం అయితే, అవి చూడటానికి చాలా భయంకరంగా ఉండటం మరో ఆశ్చర్యం కలిగించే అంశం. ఆ చేపలు చాలా వింత ఆకారంలో ఉన్నాయి. చేపల వర్షం కురవడం ఏంటి అనేది స్థానికులకు అంతుపట్టడం లేదు. పైగా ఆ చేపలు కూడా కొత్త రకంగా, వింతగా ఉన్నాయని చెబుతున్నారు.

Cat Fish Tension : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్యాన్సర్ ముప్పు తెచ్చే క్యాట్ ఫిష్ కలకలం

ఆ చేపలు నల్ల రంగులో భయానకమైన ఆకారంలో ఉన్నాయని, తినడానికి కూడా పనికి రావని చెబుతున్నారు. ఆ చేపల ఆకారం ఎంత వికృతంగా ఉందంటే.. వాటిని పట్టుకోవడానికి కూడా కొందరు వెనకడుగు వేస్తున్నారు. చూడటానికి నల్లగా, భయంకరంగా ఉన్న ఆ చేపలను వండుకుని తింటే ఏం జరుగుతుందో అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.