Maharashtra: ప్రజల నిర్ణయం మేరకే ప్రభుత్వం ఏర్పడింది: మహా సీఎం షిండే

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ కంటే షిండే వర్గం ఎక్కువ స్థానాల్ని గెలుచుకుంది. పుణే, సతారా, ఔరంగాబాద్‌, నాసిక్‌ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు కొద్ది రోజుల క్రితం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది

Maharashtra: ప్రజల నిర్ణయం మేరకే ప్రభుత్వం ఏర్పడింది: మహా సీఎం షిండే

Should have sided with BJP mandate by people says shinde

Maharashtra: తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే తిప్పికొట్టారు. ప్రజలు కోరుకున్న విధంగానే ప్రభుత్వం ఏర్పడిందని, ఇందులో ఎలాంటి ద్రోహం కానీ, మోసం కానీ లేదని ఆయన అన్నారు. తాను స్వప్రయోజనాల కోసం ఆలోచించలేదని, ప్రజా తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రజలు భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ కూటమినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తీర్పు చెప్పారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. దాన్ని మేము సవరించాం. ప్రజా తీర్పు మేరకు బీజేపీ పక్కన నిల్చోవడంతో తప్పేముంది? ఇది మేం నిర్ణయించింది కాదుగా.. ఎన్నికల్లో వచ్చిన ఫలితమే ఇది’’ అని సీఎం షిండే అన్నారు.

అటు ఉద్ధవ్ వర్గం ఇటు షిండే వర్గం మధ్య పార్టీ గుర్తు కోసం తీవ్ర రాజకీయ యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఈ కేసుపై తొందరలో తీర్పు చెప్తామని సీజేఐ రమణ కొద్ది రోజుల కింద చెప్పారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎలాంటిదైనా శివసేన కార్యకర్తల్ని తమతోనే ఉంచుకోవాలని ఉద్ధవ్ శిబిరం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం ఆదిత్య థాకరే మహారాష్ట్ర మొత్తం తిరుగుతూ శివసేన కార్యకర్తల్ని కలుసుకుంటున్నారు. అలాగే రెబల్ శివసేన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోకి వెళ్లి ఆదిత్య థాకరే ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం జరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ కంటే షిండే వర్గం ఎక్కువ స్థానాల్ని గెలుచుకుంది. పుణే, సతారా, ఔరంగాబాద్‌, నాసిక్‌ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు కొద్ది రోజుల క్రితం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 53 స్థానాలతో ద్వితియ స్థానంలో నిలిచింది. ఇక షిండే ఆధ్వర్యంలోని శివసేన 40 స్థానాలను గెలుచుకోగా ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన కేవలం 27 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.

Bihar political experiment: బిహార్ ఎక్స్‭పరిమెంట్ యూపీ లాంటిదే: జేడీయూ-ఆర్జేడీ కలయికపై బీజేపీ నేత