Lemon Juice : గ్యాస్ సమస్య ఉంటే తేనె,నిమ్మరసం కలిపి తీసుకోకూడదా?

ఒకరకంగా చెప్పాలంటే పెద్దప్రేగు యొక్క ప్రక్షాళన జరుగుతుంది. దాంతో శరీరం పోషకాలను గ్రహించడానికి, విషాన్ని వదిలించుకోవడానికి సహాయ పడుతుంది.

Lemon Juice : గ్యాస్ సమస్య ఉంటే తేనె,నిమ్మరసం కలిపి తీసుకోకూడదా?

Lemon Water

Lemon Juice : మనలో చాలా మంది ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనే,నిమ్మరసం కలిపి త్రాగుతూ ఉంటారు. తేనే, నిమ్మరసం రెండింటిలోనూ సహజ సిద్ధమైన హీలింగ్ లక్షణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి తేనే,నిమ్మరసంలను సహజసిద్ధమైన వైద్యంలో వాడుతున్నారు. ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిదని చాలా మంది తీసుకుంటూ ఉంటారు.

మన శరీరంలో కాలేయం అనేది అత్యంత ప్రధాన మైన అవయవం. మన శరీరాన్ని శుభ్రపరచడం కాలేయం పని. తేనె నిమ్మరసం క్రమం తప్పకుండా తాగడం వల్ల కాలేయం పరిశుభ్రంగా, విషపదార్థ రహితంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన మాంసకృత్తులు అందించడంతో పాటు, తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేసే కాలేయాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా కాపాడుకోవాలంటే తేనె,నిమ్మ రసం తాగవచ్చు.

నిమ్మకాయలో ఆమ్లం జీర్ణప్రక్రియలో సహాయపడి వ్యర్ధాలను,విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లను తరిమి కొడుతోంది. అంతేకాకుండా శరీరం నుండి విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. పెద్దప్రేగు యొక్క పనితీరును మెరుగుపరిచి కడుపును శుభ్రపరుస్తుంది. శరీరానికి అవసరమైన సి, బి విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ లాంటి ముఖ్యమైన ఖనిజాలు అందుతాయి. దాంతో ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.

జీర్ణంకాని ఆహారం, పేగు కణాలు మరియు చనిపోయిన బ్యాక్టీరియా యొక్క ఉత్పత్తి కారణంగా తరచుగా మన కడుపు లోపలి పొర పూస్తుంది. దాంతో ఆ పరిస్థితి వ్యాధులకు దారి తీస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ మరియు తేనె కలిపి త్రాగటం ద్వారా ప్రేగు యొక్క గోడలు ముఖ్యంగా పెద్దప్రేగు ఉత్తేజితమయి విషాలను బయటకు పంపుతుంది.

ఒకరకంగా చెప్పాలంటే పెద్దప్రేగు యొక్క ప్రక్షాళన జరుగుతుంది. దాంతో శరీరం పోషకాలను గ్రహించడానికి, విషాన్ని వదిలించుకోవడానికి సహాయ పడుతుంది. ప్రేగు కదలికలను ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది.

గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత కనీసం ఒక గంట వరకు కాఫీ లేదా టీ తాగకూడదని గుర్తుంచుకోండి. గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు ఎసిడిటి, కడుపులో మంట, గుండెలో మంట లాంటివి. కొన్ని గ్యాస్ట్రిక్ కారణాలేమంటే వైరల్ ఇంఫెక్షన్స్, ఫుడ్ పొయిజనింగ్, కిడ్నీ లో రాళ్ళు, అజీర్నం, త్యూమర్లు, అల్సర్లు లాంటివాటి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

అదే క్రమంలో గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మ రసాన్ని వాడటం ఎంతో మంచిదని కూడా సూచిస్తున్నారు. గ్యాస్ సమస్య ఉత్పన్నమయినప్పుడు ఒక నిమ్మకాయను తీసుకోని, ముక్కలుగా కోసి దానిలో నుంచీ రసాన్ని తీసి తర్వత దానిలో సగం టేబుల్ స్పూన్ బేకింగ్ సోడ వేసి దానిలో కాస్త ఒక కప్ నీటిని వేసుకుని త్రాగితే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చట.