Shravani : పల్లెలో గానకోకిల.. ఫిదా అయిన కేటీఆర్..

మెదక్ జిల్లా, నారైంగి విలేజ్‌కు చెందిన శ్రావణి తన మధురమైన గాత్రంతో ‘‘రేలా రే రేలా రే.. నీళ్ల‌ల్లో నిప్ప‌లే, వ‌చ్చింది నిజ‌మ‌ల్లే.. ప‌డిలేచి నిలిచే ర‌ణ‌ములో.. నా తెలంగాణ’’.. అనే పాటను అద్భుతంగా పాడింది..

Shravani : పల్లెలో గానకోకిల.. ఫిదా అయిన కేటీఆర్..

Shravani Voice Is Is Mesmerising Ktr Tag To Dsp And Thaman S

Shravani: ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. పేరెంట్స్ తమ పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ మంచి శిక్షణ ఇప్పిస్తే తమకిష్టమైన రంగంలో చక్కగా రాణిస్తారు. సినిమా రంగంలో అవకాశం రావాలన్నా, వచ్చిన దాన్ని సరిగా వినియోగించుకోవాలన్నా.. టాలెంట్‌కి అదృష్టం కూడా యాడ్ అవ్వాలి.

అయితే ఇప్పుడున్న పలు సామాజిక మాధ్యమాల ద్వారా పాపులారిటీతో పాటు అవకాశాలు అందిపుచ్చుకోవడం తేలికవుతుంది. బాలీవుడ్‌లో రేణు మండల్, టాలీవుడ్‌లో బేబి పాటలు పాడిన వీడియోలు వైరల్ కావడంతో వారికి సినిమాల్లో సాంగ్స్ పాడే ఛాన్స్ వచ్చింది.

టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన దుర్గా రావ్ కూడా తన భార్యతో కలిసి పలు షోలలో పాల్గొన్నాడు. ‘క్రాక్’ సినిమాలోని ‘భూం బద్దల్’ పాటలో రవితేజ, దుర్గా రావ్‌ని ఇమిటేట్ చేస్తూ స్టెప్ వెయ్యడం విశేషం. ఇప్పుడు ఓ టాలెంటెడ్ సింగర్ అద్భుతంగా పాట పాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఎంతలా అంటే.. ఏకంగా తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ మెచ్చుకునేంతగా.. వివరాళ్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా, నారైంగి విలేజ్‌కు చెందిన శ్రావణి తన మధురమైన గాత్రంతో ‘‘రేలా రే రేలా రే.. నీళ్ల‌ల్లో నిప్ప‌లే, వ‌చ్చింది నిజ‌మ‌ల్లే.. ప‌డిలేచి నిలిచే ర‌ణ‌ములో.. నా తెలంగాణ’’.. అనే పాటను అద్భుతంగా పాడింది. ఆమె పాట పాడుతున్న వీడియోను సురేంద్ర తిప్పరాజు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. మినిస్టర్ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

శ్రావణిలో మంచి టాలెంట్ ఉంది.. ఆమె ప్రతిభను ప్రోత్సహిస్తూ అవకాశం లభించేలా చూడాలంటూ ఆయన కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశారు. శ్రావణి వీడియో చూసిన కేటీఆర్.. ఆమెలో మంచి టాలెంట్ ఉందని అభినందించారు. అలాగే శ్రావణికి అవకాశం కల్పించాలంటూ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, తమన్‌లను కోరారు. మంచి ఆఫర్ వస్తే సింగర్‌గా ప్రూవ్ చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది యువ గాయని శ్రావణి..