ఇన్‌‌స్టాలో హీటెక్కిస్తున్న శృతి హాసన్

ఇన్‌‌స్టాలో హీటెక్కిస్తున్న శృతి హాసన్

లాక్ డౌన్ టైంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. తమకి వచ్చిన పనులు చేస్తూ, నచ్చిన పనులు నేర్చుకుంటూ, కొత్త సినిమాలకోసం మేకోవర్ అవుతూ ఎప్పటికప్పుడు ప్రేక్షకాభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. పనిలో పనిగా Throwback Pictures పేరుతో కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా యాక్ట్రెస్ కమ్ సింగర్ శృతి హాసన్ షేర్ చేసిన అండర్ వాటర్ అండ్ క్రియేటివ్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గతంలో శృతి అండర్ వాటర్ ఫొటోషూట్‌లో పాల్గొన్నప్పటి పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మోనోక్రోమ్ టోన్ ఫొటోలతో పాటు ఒకే ఒక కలర్ ఫొటో షేర్ చేసింది శృతి హాసన్. చాలా రోజుల తర్వాత ఆమె అందాల ఆరబోత చూసిన అభిమానులు విపరీతంగా లైక్లు కొడుతూ.. శృతి ఇన్‌‌స్టాలో హీటెక్కిస్తోంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే తమిళ్‌లో విజయ్ సేతుపతితో నటించిన ‘లాబం’ విడుదలకు సిద్ధమవగా రవితేజతో నటిస్తున్న ‘క్రాక్’ షూటింగ్ దశలో ఉంది.

Shruti Haasan

 

Read: గుడ్ బై సుశాంత్: ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ