Shukra Movie : బ్రిలియంట్ థ్రిల్లర్ ‘శుక్ర’ – మూవీ రివ్యూ..

: చిన్న సినిమాకు కావాల్సింది స్టార్స్ ఇమేజ్, ప్యాడింగ్ ఆర్టిస్టుల హంగామా, గ్రాండ్ మేకింగ్ ఇవేమీ కాదు.. జస్ట్ మూడు గంటలు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథా కథనాలు.. అలాంటి సరుకు ఉన్న సినిమా ఎలాంటి టైమ్‌లో రిలీజైనా ప్రేక్షకుల స్పందనలో ఇబ్బంది ఉండదు..

Shukra Movie : బ్రిలియంట్ థ్రిల్లర్ ‘శుక్ర’ – మూవీ రివ్యూ..

Shukra Movie

Shukra Movie: చిన్న సినిమాకు కావాల్సింది స్టార్స్ ఇమేజ్, ప్యాడింగ్ ఆర్టిస్టుల హంగామా, గ్రాండ్ మేకింగ్ ఇవేమీ కాదు.. జస్ట్ మూడు గంటలు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథా కథనాలు.. అలాంటి సరుకు ఉన్న సినిమా ఎలాంటి టైమ్‌లో రిలీజైనా ప్రేక్షకుల స్పందనలో ఇబ్బంది ఉండదు. సరిగ్గా ఇలాంటి నమ్మకంతోనే ఈ శుక్రవారం విడుదలైంది ‘శుక్ర’.. మైండ్ గేమ్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం…

కథలోకి వెళ్తే…
వైజాగ్ నగరంలో థగ్స్ అనే మాఫియా ముఠా వరుస నేరాలకు పాల్పడుతుంటుంది. డబ్బున్న కుటుంబాలను హతమార్చి లూటీలు చేస్తుంటారు. నగరం నేరమయంగా ఉన్నప్పుడు ఇక్కడికి భార్యతో కలిసి వస్తాడు విల్లి. విలియమ్ అలియాస్ విల్లి (అరవింద్ కృష్ణ) ఒక బిజినెస్ మెన్. సొంత కంపెనీ నడుపుతుంటాడు. అతని అందమైన వైఫ్ రియా (శ్రీజిత ఘోష్). విల్లి బిజీ లైఫ్ వల్ల వైజాగ్ వచ్చాకే ఈ జంటకు ప్రైవసీ దొరుకుతుంది. భర్త తనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని రియా కోరిక. తన బర్త్‌డేకు హౌస్ పార్టీ కావాలని విల్లిని కోరుతుంది రియా. అలా తన క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి విల్లీ – రియా ఇంట్లో పార్టీ చేసుకుంటారు. ఈ పార్టీ జరిగిన రాత్రి అనూహ్యంగా రియా, మరో ఇద్దరి హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు చేసిందెవరు, హత్యలకు కారణం ఏంటి, తన భార్యను, స్నేహితులను చంపిన ఆ నేరస్థుడిని విల్లి ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ.

Shukra

ఎలా ఉందంటే…
ఇదొక బ్రిలియంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. దర్శకుడు సుకు పూర్వజ్ సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి మేకింగ్‌లో తన ప్రత్యేకత చూపించారు. ప్రతి సీన్ డైరెక్టర్‌కు కథ మీదున్న పట్టును, క్రియేటివ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూపిస్తుంది. దర్శకుడు కథను గందరగోళం లేకుండా కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా క్లైమాక్స్ వరకు లీడ్ చేశాడు. విల్లి, రియా మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సరదాగా సాగుతుంటాయి. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. వజ్రాల స్మగ్లింగ్ ఈ హత్యలకు కారణం అని తెలిసినప్పడు కథ మీద అంచనాలు మరింత పెరుగుతాయి. ప్రతి సీన్‌కు ఎడిటింగ్‌లో వేసిన డిస్క్రిప్షన్స్ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి తన కెమెరా విశ్వరూపం చూపించాడు.

నటీనటుల పెర్ఫార్మెన్స్..
విల్లి క్యారెక్టర్ అంటే అరవింద్ కృష్ణ గుర్తొచ్చేలా నటించాడు. భార్యతో సరదాగా ఉన్న రొమాంటిక్ సీన్స్‌లో మ్యాన్లీగా కనిపించాడు. ఒక బిజినెస్ మేన్‌గా ప్రొఫెషనల్ బాడీ లాంగ్వేజ్ చూపించాడు. తన బెటర్ హాఫ్ హత్యకు గురయినప్పుడు ఎమోషనల్ సీన్స్‌లో అరవింద్ సహజంగా నటించి మెప్పించాడు. రియా క్యారెక్టర్‌లో శ్రీజిత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. డబుల్ గ్లామర్ డోస్ ఇచ్చి, ట్రెండీ హీరోయిన్ అనేలా చేసింది. మెయిన్ లీడ్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు కన్విన్సింగ్‌గా నటించారు. ఇక క్లైమాక్స్‌లో ‘శుక్ర’ కు సీక్వెల్ ‘శుక్ర 2’ ఉంటుందని చెప్పేయడం మరో విశేషం. మొత్తంగా ఇన్నోవేటివ్ మూవీస్ చూడాలనుకునే వారికి ‘శుక్ర2 ఈ వీక్ మంచి ఆప్షన్..

Shukra