Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్లకు పంపనున్న ‘శ్యామ్ సింగరాయ్’.. మూడు విభాగాల్లో..
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ సింగరాయ్ సినిమాని తెరకెక్కించారు. కరోనా ఇబ్బందులు దాటుకొని మరీ గత సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమా.........
Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ సింగరాయ్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు ఫీమేల్ లీడ్ లో నటించారు. కరోనా ఇబ్బందులు దాటుకొని మరీ గత సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి విజయం సాధించింది. మొదటి సారి నాని ఓ పీరియాడిక్ పాత్రలో నటించారు. సాయి పల్లవి అద్భుతమైన నటన, డ్యాన్స్ కి బాగా పేరు వచ్చింది.
ఇక ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయి మరిన్ని రికార్డులు సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక రేటింగ్‌ను సాధించి దాదాపు 10 వారాల పాటు టాప్ ట్రెండ్‌లో ఉంది శ్యామ్ సింగరాయ్. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాని భారతదేశం తరపున మూడు విభాగాలలో ఆస్కార్ నామినేషన్లకు పంపిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు.
Amala Paul : ఆ సినిమా కోసం మార్చురీలోకి వెళ్ళా.. పోస్ట్‌మార్టం చేయడం డైరెక్ట్ గా చూసి షాక్ అయ్యా..
పీరియాడిక్ ఫిల్మ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్ అనే మూడు కేటగిరీల్లో శ్యామ్ సింగరాయ్ సినిమాని ఆస్కార్ నామినేషన్లకు పంపుతున్నారు. ఒకవేళ ఆస్కార్ నామినేషన్లకు సెలెక్ట్ అయినా మరో రికార్డ్ సాధించినట్టే. దీంతో నాని ఫ్యాన్స్ ఈ సినిమా ఆస్కార్ నామినేషన్లకు సెలెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు.