Siddaramaiah calls Bommai RSS slave: బొమ్మై ఆర్ఎసెఎస్ బానిస: కర్ణాటక ముఖ్యమంత్రిపై సిద్ధరామయ్య ఫైర్

దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ ఎంతగానో చేశారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనెలా ప్రజలను ప్రేరేపించేందుకు అనేక లేఖలు, పుస్తకాలు రాశారని సిద్ధరామయ్య అన్నారు. అయితే నెహ్రూ సావర్కర్ లాగ క్షమాపణ లేఖలు రాయలేదని, బహుశా అందుకే స్వాతంత్ర్య సమరయోధుల జాబితా నుంచి తొలగించారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బొమ్మై యావత్ జాతిని అవమానించారని, వెంటనే ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.

Siddaramaiah calls Bommai RSS slave: బొమ్మై ఆర్ఎసెఎస్ బానిస: కర్ణాటక ముఖ్యమంత్రిపై సిద్ధరామయ్య ఫైర్

Siddaramaiah calls Bommai RSS slave

Siddaramaiah calls Bommai RSS slave: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని రాష్ట్రీయ స్వయం సేవక్ బానిస అంటూ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. అయితే ఇందులో భారత మొదటి ప్రధానమంత్రి జవహార్‭లాల్ నెహ్రూ ఫొటో లేకపోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు బీజేపీ నడుస్తోందని, ఆ ఆదేశాల మేరకే భారత తొలి ప్రధానమంత్రి ఫొటోను వేయలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ విషయమై సిద్ధూ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. జైలు నుంచి విడుదల కోసం వీర సావర్కర్ బ్రిటిషర్లను బతిమాలుకున్నారని, అతడి మనుగడ కోసం బ్రిటిష్ గొంతుకగా మారారని సిద్ధూ అన్నారు. అయితే బ్రిటిషర్లు వెళ్లడంతోనే బానిసత్వం పోయిందని చెబుతున్నప్పుడు బొమ్మై ఎందుకు ఆర్ఎస్ఎస్ బానిసలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దేశ తొలి ప్రధాని ఫొటోను వేయకపోవడం ఎంత క్రూరమైన చర్యనో బొమ్మై ఆలోచించాలని ఆయన అన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ ఎంతగానో చేశారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనెలా ప్రజలను ప్రేరేపించేందుకు అనేక లేఖలు, పుస్తకాలు రాశారని సిద్ధరామయ్య అన్నారు. అయితే నెహ్రూ సావర్కర్ లాగ క్షమాపణ లేఖలు రాయలేదని, బహుశా అందుకే స్వాతంత్ర్య సమరయోధుల జాబితా నుంచి తొలగించారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బొమ్మై యావత్ జాతిని అవమానించారని, వెంటనే ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.

Maharashtra: ప్రజల నిర్ణయం మేరకే ప్రభుత్వం ఏర్పడింది: మహా సీఎం షిండే