Siddhu Jonnalagadda : చిన్న సినిమా.. పెద్ద హిట్.. థియేటర్స్‌లో అదరగొడుతున్న ‘డిజే టిల్లు’

యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డిజే టిల్లు'. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత...........

Siddhu Jonnalagadda :  చిన్న సినిమా.. పెద్ద హిట్.. థియేటర్స్‌లో అదరగొడుతున్న ‘డిజే టిల్లు’

Dj Tillu

DJ Tillu :  యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజే టిల్లు’. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శనివారం ఫిబ్రవరి 12న రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది ‘డిజే టిల్లు’.

ముందు నుంచి ‘డిజే టిల్లు’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘డిజే టిల్లు’ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలిసింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. అంతకు ముందే హీరో సిద్ధు జొన్నలగడ్డ ఓటీటీలో రెండు హిట్స్ కొట్టడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. సినిమా ప్రమోషన్స్ ని కూడా ఎక్కడా తగ్గకుండా భారీ సినిమా లెవల్లో చేశారు నిర్మాతలు. ఈ సినిమా టైటిల్ సాంగ్ అయితే బాగా వైరల్ అయింది. ఎక్కడ విన్నా ‘డిజే టిల్లు’ టైటిల్ సాంగ్ వినిపిస్తూనే ఉంది.

నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయిన ‘డిజే టిల్లు’ సినిమా హిట్ టాక్ తో దూసుకు పోతుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయినా భారీ విజయాన్ని దక్కించుకుంది. యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో మూడు రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్ తో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అవ్వడం విశేషం. హీరో సిద్దు జోన్నల గడ్డ టిల్లు పాత్రలో తన టైమింగ్ తో, బాడీ లాంగ్వేజ్ తో చాలా యూనిక్ గా కనిపించి అందర్నీ మెప్పించాడు. సిద్దు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేశాడు. ఇక హీరోయిన్ నేహాశర్మ తన బ్యూటిఫుల్ లుక్స్ తో, అందంతో ప్రేక్షకులని ఆకట్టుకుంది.

Mahesh Babu : పైరసి అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి.. ‘సర్కారు వారి పాట’ సాంగ్ లీక్‌పై స్పందించిన తమన్

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకల మ్యూజిక్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. డైరెక్టర్ విమల్ కృష్ణ స్టొరీ లైన్ ని ఫుల్ ఎంటర్టైనింగ్ గా మలచడంలో సక్సెస్ అయ్యాడు. అతను డిజైన్ చేసిన టిల్లు పాత్ర చాలా బాగా వచ్చింది. నిర్మాత నాగవంశీ పెద్ద సినిమాకి తగ్గకుండా ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ రిచ్ గా వుండేలా నిర్మించారు.

Mohan Babu : జీవితంలో రిస్కులు చేయాలి.. ఒక్క పాట కోసం చాలా ఖర్చుపెట్టాం

‘డిజే టిల్లు’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 500 థియేటర్స్ లో, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 100 థియేటర్స్ లో, ఓవర్సీస్ లో 100 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. మంచి ఓపెనింగ్స్ సాధించింది ఈ సినిమా. సిద్ధు జొన్నలగడ్డ మరో హిట్ సాధించాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. దీంతో మౌత్ టాక్ తోనే సినిమాకి ప్రేక్షకులు బాగా వస్తున్నారు. మొత్తానికి చిన్న సినిమాగా తెరకెక్కించిన ‘డిజే టిల్లు’ భారీ విజయం దక్కించుకుంది.