మంగ్లీ ‘కన్నే అదిరింది’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది!..

మంగ్లీ ‘కన్నే అదిరింది’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది!..

Mangli Kanne Adhirindhi Song: పాపులర్ యాక్టర్, కన్నడ ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా.. ‘రాబర్ట్’.. ఇందులో ఫోక్ సింగరే కాదు.. స్టార్ సింగర్‌.. అనిపించుకున్న టాలెంటెడ్ టాలీవుడ్ సింగర్ మంగ్లీ పాడిన ‘‘కన్నె అదిరింది’’ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంగ్లీ స్టేజ్ మీద ఈ సాంగ్ పర్ఫామ్ చెయ్యగా యూనిట్ అండ్ ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

MANGLI

 

10 TV యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అప్‌లోడ్ చేసిన అతి తక్కువ టైంలోనే కోటి వ్యూస్ క్రాస్ చేసిందీ సాంగ్.. ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోకి ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రాలేదు. ఇప్పటి వరకు కోటికి పైగా వ్యూస్, రెండు మిలియన్లకు పైగా లైక్స్‌తో దూసుకుపోతోంది. అర్జున్ జన్యా ట్యూన్ కంపోజ్ చెయ్యగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాసిన ఈ పాటను మంగ్లీ తన స్టైల్ మ్యాడ్యులేషన్‌తో మెస్మరైజ్ చేసేలా పాడారు. కన్నడలో ‘మెలోడి క్వీన్’ శ్రేయా ఘోషల్ పాడారు.

Roberrt

సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన సీనియర్ హీరో జగపతిబాబు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో ఆశా భట్ కథానాయిక. తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వంలో ఉమాపతి ఫిల్మ్స్ బ్యానర్ మీద ఉమాపతి శ్రీనివాస గౌడ నిర్మిస్తున్న ‘రాబర్ట్’ మార్చి 11న కన్నడ, తెలుగు భాషల్లో భారీగా విడుదల కానుంది..

ఫోక్ సింగరే కాదు.. స్టార్ సింగర్‌..