చిన్న బ్రేక్.. చిటికెలో వస్తా.. శివ మాలలో రామ్..

చిన్న బ్రేక్.. చిటికెలో వస్తా.. శివ మాలలో రామ్..

Ram Pothineni: ఇటీవలే ‘రెడ్’ మూవీతో ఆకట్టుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాల నుండి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఎందుకు, ఏంటి కారణం అంటే.. రామ్, శివ మాల వేసుకున్నారు. ఈ మాల ధరిస్తే 41 రోజుల పాటు దీక్ష చెయ్యాలి. అందుకే రామ్ కొద్దిరోజులు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

శివ మాల ధరించి, గాగుల్స్ పెట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘ఓం నమః శివాయ, చిన్న బ్రేక్‌ తీసుకున్నాను. మళ్లీ వస్తాను’’.. అని తెలిపారు. ద్విపాత్రాభినయంతో ఈ సంక్రాంతికి ‘రెడ్‌’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఉస్తాద్ రామ్ కొత్త సినిమా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.