Small Directors : చిన్న డైరెక్టర్లకు పెద్ద సినిమా అవకాశాలు..

గట్టిగా 2, 3 సినిమాలు కూడా చెయ్యలేదు.. కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ డైరెక్టర్ల పేరే వినిపిస్తోంది..

Small Directors : చిన్న డైరెక్టర్లకు పెద్ద సినిమా అవకాశాలు..

Small Directors

Small Directors: గట్టిగా 2, 3 సినిమాలు కూడా చెయ్యలేదు.. కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ డైరెక్టర్ల పేరే వినిపిస్తోంది. వీళ్ల సినిమాలకు స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయారు.. అందుకే పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఇలా అండర్ డాగ్స్‌గా ఇండస్ట్రీలోకొచ్చి టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లపై లెట్స్ హ్యావ్ ఎ లుక్.

సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని, చిన్న సినిమాలు చేసుకుంటూ తమ టాలెంట్ ప్రూవ్ చేసకున్నారు. గట్టిగా రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోల కళ్లలో పడి సినిమాలు చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. లేటెస్ట్‌గా నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ్ స్టార్ హీరో విజయ్‌తో సినిమా ఛాన్స్ కొట్టేశారు. నయనతార, శివకార్తికేయన్‌తో చెరో సినిమా చేసిన దిలీప్.. ఇప్పుడు ఏకంగా విజయ్ 65 వ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ కూడా అంతే.. ‘ఉగ్రమ్’ సినిమా చేసి అందరి దృష్టిలో పడ్డారు. ‘కె.జి.యఫ్’ తో అసలు ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యని రేంజ్‌కి వెళ్లిపోయిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ల క్యూ లో ఉన్నారు. ‘కె.జి.యఫ్’ 2 రిలీజ్ అవ్వకుండానే ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్‌తో మరో సినిమా లైన్లో పెట్టారు ప్రశాంత్.
వాయిస్
వేణు శ్రీరామ్.. జస్ట్ ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎమ్.సి.ఎ’.. చేసింది ఈ రెండు సినిమాలే. కానీ ఏకంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. పవన్‌తో చేసిన ‘వకీల్ సాబ్’ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఎప్పుడో ఆగిపోయిన బన్నీ సినిమా ‘ఐకాన్’ ని మళ్లీ స్టార్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.

‘జిల్’ సినిమా చేసిన రాధా కృష్ణ కూడా అంతే.. చేసింది ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా భారీ స్టార్ కాస్ట్‌తో పాన్ ఇండియా లెవల్లో ‘రాధే శ్యామ్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాధా కృష్ణ.

‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ఇలా రెండు డిఫరెంట్ సినిమాలు చేసిన సాగర్ చంద్ర గురించి టాలీవుడ్‌లో పెద్దగా తెలీదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే సరికి హాట్ టాపిక్ అయ్యారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ని పవన్, రానాతో రీమేక్ చేస్తున్నారు సాగర్ చంద్ర.

తక్కువ సినిమాలు చేసినా టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’.. ఇలా చేసింది రెండే రెండు సినిమాలు. కానీ ఆ సక్సెస్ సౌండ్ మాత్రం స్టార్ హీరోల చెవిన పడింది. దాంతో ప్రభాస్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. దీపికా పడుకోన్ హీరోయిన్‌గా అమితాబ్ బచ్చన్ ఇంపార్టెంట్ రోల్‌లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు నాగి.

‘అర్జున్ రెడ్డి’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఫస్ట్ సినిమాతోనే కాంట్రవర్సీలు క్రియేట్ అయినా.. అన్నింటినీ దాటి సినిమాని సూపర్ సక్సెస్ చేశారు సందీప్ రెడ్డి. సెకండ్ ఛాన్స్‌కి కాస్త టైమ్ పట్టినా.. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు సందీప్ .

గౌతమ్ తిన్ననూరి కూడా అంతే.. ‘మళ్లీరావా’, ‘జెర్సీ’ సినిమాలతో టాలీవుడ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్‌కి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఛాన్సిచ్చారు. ప్రజెంట్ ‘జెర్సీ’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు గౌతమ్. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. ప్రజెంట్ నానితో ‘అంటే.. సుందరానికి..’ సినిమా చేస్తున్నారు. ‘టాక్సీవాలా’ సినిమా చేసిన రాహుల్ సంకృత్యాన్ కూడా నానితో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేస్తున్నారు.