చెట్టు ఆకులను అందుకోవడానికి దున్నపోతును నిచ్చెనలా వాడుకొందీ ఈ మేక.. నిజంగా స్మార్టే..!

  • Published By: sreehari ,Published On : June 30, 2020 / 06:45 PM IST
చెట్టు ఆకులను అందుకోవడానికి దున్నపోతును నిచ్చెనలా వాడుకొందీ ఈ మేక.. నిజంగా స్మార్టే..!

ఇదో తెలివైన మేక.. ఆకలి వేసింది.. చెట్ల ఆకులు చూడగానే నోరూరింది. కానీ, అందనంత పైనా ఉన్నాయి. ఏం చేయాలో తోచలేదు ఆ మేకకు.. అప్పుడే ఐడియా తట్టింది. వెంటనే ఆ చెట్టుకు కట్టేసిన గేదెను చూసింది. తన పని సులభమని భావించింది. వెంటనే ఆ గేద తలపై నుంచి దానిపైకి ఎక్కేసింది. చెట్లు కొమ్మలను కిందికి లాగి ఆకులను ఆరగించింది.

చెట్టు కొమ్మలను అందుకునేందుకు గేదెను నిచ్చెనలా వాడింది. ఎంతైనా తెలివైనా మేక కదా… అలా తన ఆకలి తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక అవసరం ఒకరితో ఏమైనా చేయిస్తుందని.. అలాగే ఆ అవసరాన్ని తీర్చుకునేందుకు ఏదో దారి వెతుకునేలా చేస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.. ఈ వీడియో, ఇటీవల ట్విట్టర్‌లో బాగా వైరల్ అవుతోంది.


వీడియో పాతదే అయినప్పటికీ.. ఇటీవల ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక మేక, ఒక గేదె చెట్టు ముందు నిలబడినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. చూస్తుండగానే.. క్షణాల్లో ఆ మేక గేదె వెనుకభాగం నుంచి పైకి ఎక్కింది. పెద్ద బోవిన్‌ నిచ్చెనగా ఉపయోగించుకుంది. చివరికి చెట్టు ఆకులను ఆరగించిన మేక సంతోషంగా కిందికి దిగిపోయింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ‘స్మార్ట్ మేక’ అని వీడియోను షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకూ వీడియోకు 12,000 వ్యూస్, 1,200 మంది లైక్‌లు వచ్చాయి. వీడియోను చూసిన వారంతా నవ్వు ఆపులేకపోతున్నారు. జంతువులు మనుషులు అనుకున్నదానికంటే తెలివిగా ఉంటాయని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.