Smriti Irani: స్మృతి ఇరానీపై ట్వీట్లు డిలీట్ చేయండి.. కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు

స్మృతి ఇరానీ కూతురుకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా తొలగించాలని కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది.

Smriti Irani: స్మృతి ఇరానీపై ట్వీట్లు డిలీట్ చేయండి.. కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలపై స్మృతి ఇరానీ ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేష్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు నోటీసులు జారీ చేసింది.

Mass Hysteria: అరుపులు.. ఏడుపులు.. స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించిన అమ్మాయిలు… అసలేమైంది?

స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. లేకుంటే రెండు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని సూచించింది. ‘‘సరైన ఆధారాలు లేకుండా, ఉన్న వాటిని పరిశీలన చేయకుండా స్మృతి ఇరానీపై ఆరోపణలు చేశారు. ఇవి స్మృతి ఇరానీకి వేదన కలిగించాయి’ అని కోర్టు అభిప్రాయపడింది. ఈ నోటీసులపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ స్పందించారు. ‘‘స్మృతి ఇరానీ కేసుకు సంబంధించి కోర్టు మాకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఆధారాలను కోర్టుకు సమర్పించబోతున్నాం. ఆమెపై చేసిన ఆరోపణల్ని నిరూపించబోతున్నాం’’ అని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర న్యాయ శాఖా మంద్రి కిరణ్ రిజిజు కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. ‘‘ఏ వ్యక్తిపైనైనా, ఉన్నత స్థానంలో ఉన్న ఎవరిపైనైనా ఆరోపణలు చేసే ముందు వాటిలో నిజానిజాలు తెలుసుకోవాలి’’ అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.

Monkeypox: మంకీపాక్సా.. స్కిన్ అలర్జీనా? తేడా తెలుసుకోండి

స్మృతి ఇరానీ కూతురు అక్రమంగా గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు అంటూ కాంగ్రెస్ గతవారం ఆరోపణలు చేసింది. దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని స్మృతి ప్రకటించారు. తాజాగా కోర్టులో పరువునష్టం దావా వేసి కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు.