Snake catcher died of a snake bite : పాము కాటుతో నరేశ్ మృతి.. కారు, బైక్ డిక్కీ నిండా పాములే పాములు..

స్నేక్ క్యాచర్‌గా నరేశ్ చాలా ఫేమస్. 27 సంవత్సరాలుగా పాములు పట్టుకోవడమే పనిగా 40 వేల పాముల్ని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టి ఉంటాడు. దురదృష్టవశాత్తూ పట్టుకున్న పాము అతని ప్రాణాలు బలిగొంది.

Snake catcher died of a snake bite : పాము కాటుతో నరేశ్ మృతి.. కారు, బైక్ డిక్కీ నిండా పాములే పాములు..

Bengaluru

Bengaluru : 27 సంవత్సరాలుగా పాములు పట్టడమే అతని పని.. 40వేల పాముల్ని పట్టుకుని ఉంటాడు. పాము వల్ల తనకు హాని జరుగుతుందని ఊహించి కూడా ఉండడు. స్నేక్ నరేశ్ ను పట్టుకున్న పామే కాటు వేసి ప్రాణం తీసింది. అయితే అతను చనిపోయిన తరువాత ఇంటికి వెళ్లి చూసిన అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Viral Video : OMG.. తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్న చిన్నారి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

51 ఏళ్ల స్నేక్ క్యాచర్ నరేష్ ఇప్పటి వరకూ 40 వేల పాముల్ని పట్టుకుని అడవుల్లో వదిలేసి ఉంటాడు. అలాంటిది విధి రాత.. రీసెంట్ గా అతను పట్టుకున్న పాము కాటు వేయడంతో ఆసుపత్రికి తరలించే లోపు చనిపోయాడు. చిక్కమగళూరులోని హొసమనె లే అవుట్‌లో ఈ ఘటన జరిగింది. విష సర్పాలను పట్టుకున్న నరేశ్ స్కూటర్ డిక్కీలో వేసుకున్నాడు. వాటిని బయటకు తీసే ప్రయత్నంలో ఓ నల్ల తాచు కాటు వేసినట్లు తెలుస్తోంది. నరేష్ చనిపోవడంతో డిక్కీలోని విష సర్పాలను పట్టేందుకు మరో స్నేక్ క్యాచర్‌ను రప్పించక తప్పలేదు పోలీసులకు.

Selfie With Snake: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. పాముతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన యువకుడు… పాము కాటుతో మృతి

ఇక నరేష్ వాడే బైక్, కారు డిక్కీలో 35 కు పైగా పలు జాతులకు చెందిన విష సర్పాలు కనిపించడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతని ఇంట్లో సైతం 40 పాములు కనిపించాయి. అన్నిటినీ అడవుల్లోకి విడిచిపెట్టినట్లు చిక్కమగళూరు డీఎఫ్ఓ క్రాంతి తెలిపారు. అయితే పాముల్ని పట్టిన తరువాత వాటిని నరేశ్ ఇంట్లోనే ఉంచుకోవడంపై పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.