Snakes In Home: ఇంట్లో 60 పాములు.. అడవిలో వదిలేసిన అధికారులు

ముజఫర్‌నగర్ జిల్లా, ఖతాలీ తహసీల్‌ గ్రామంలోని రంజిత్‌ సింగ్‌కు చెందిన ఇంటి నుంచి 60 పాములను, 75 పాము గుడ్డు పెంకులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Snakes In Home: ఇంట్లో 60 పాములు.. అడవిలో వదిలేసిన అధికారులు

Snakes In Home

Snakes In Home: పామును చూస్తేనే భయంతో ఆమడదూరం పారిపోతాము. అలాంటిది ఓ ఇల్లు పాముల గూడులా మారితే ఇంకా ఏమైనా ఉందా! అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ముజఫర్‌నగర్ జిల్లా, ఖతాలీ తహసీల్‌ గ్రామంలోని రంజిత్‌ సింగ్‌కు చెందిన ఇంటి నుంచి 60 పాములను, 75 పాము గుడ్డు పెంకులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Supreme Court : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు: సుప్రీం ఆదేశం

ఈ ఇంటిని గతంలో అద్దెకు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ ఇంటిలో ఎవరూ ఉండటంలేదు. దీంతో ఆ ఇంట్లోని బాత్రూమ్లో 60 పాములు, 75 గుడ్ల పెంకులు కనిపించాయి. ఇంట్లోనే పాముల సంచారం చూసిన అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి పాములను పట్టుకున్నారు. అనంతరం దూరంగా ఉన్న అడవుల్లోకి తీసుకువెళ్లి వాటిని వదిలారు. అయితే చుట్టు ప్రక్కల సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లనే ఇంత పెద్ద సంఖ్యలో పాములు ఇంట్లోకి వచ్చాయని స్థానికులు వాపోతున్నారు.