Solar Cycle : సోలార్ సైకిల్ ; మధురై విద్యార్ధి కొత్త ఆవిష్కరణ

కొత్త వాటిని రూపొందించాలన్న ఆలోచనలు చేసే ధనుష్ కు ఒకరోజు సోలార్ సైకిల్ రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.

Solar Cycle : సోలార్ సైకిల్ ; మధురై విద్యార్ధి కొత్త ఆవిష్కరణ

సోలార్ సైకిల్ తయారుచేసిన మధురై విద్యార్ధి

Solar Cycle : దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు పెరగటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిస్తారిస్తున్నారు పబ్లిక్.. ఈ క్రమంలోనే కొంత మంది ఔత్సాహికులు సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. మధురైకు చెందిన ఓ డిగ్రీ విద్యార్ధి ఇదే తరహాలో విన్నూత్నతరహాలో ఆలోచించి సోలార్ సైకిల్ ను రూపొందించాడు. నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తితో అతను తయారు చేసిన సోలార్ సైకిల్ కు అందరి నుండి ప్రశంసలు అందుతున్నాయి.

మధురైకి చెందిన ధనుష్ కుమార్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఎప్పుడు ఏదో కొత్త వాటిని రూపొందించాలన్న ఆలోచనలు చేసే ధనుష్ కు ఒకరోజు సోలార్ సైకిల్ రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా తన ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టాడు. రెండు సోలార్ ప్లేట్లను కొనుగోలు చేసి వాటిని సీటు వెనక భాగంలో అమర్చాడు. సోలార్ ప్లేట్ల నుండి వచ్చే విద్యుత్ ను ఓ బ్యాటరీకి అనుసంధానించాడు. ఒక్కసారి బ్యాటరీ ఛార్జి అయితే సైకిల్ 50 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

కిలోమీటరుకు 1.5రూ మాత్రమే ఖర్చవుతుందని ధనుష్ కుమార్ చెబుతున్నాడు. తక్కువ ఛార్జింగ్ ఉన్న సమయంలో సైతం సైకిల్ పై 20 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. అతను రూపొందించిన సైకిల్ ను చూసిన అతను చదివిని స్ధానిక అమిరికన్ కళాశాల అధ్యాపకులు అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతన్న నేపధ్యంలో ధనుష్ కుమార్ తరహాలోనే విన్నూత్న ఆలోచనలతో ముందుకు రావాలని అకాంక్ష అందరిలో వ్యక్తమౌతుంది.