‘పెళ్లి చేసుకోవాలి’.. ఆర్.నారాయణ మూర్తి మాటలకి తేజ్ ఏం చేశాడు?..

10TV Telugu News

SBSB Trailer: సుప్రీం హీరో సాయి తేజ్, నభా నటేష్ జంటగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ‘సోలో బ్రతుకే సో బెటర్’.. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి స్పందన లభించింది. శనివారం ట్రైలర్ విడుదల చేశారు.
సాయి తేజ్ యూత్ కి నచ్చే క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

SBSB Trailer

విరాట్ అనే కుర్రాడికి పెళ్లంటే ఎందుకంత చిరాకు.. సోలోగానే ఎందుకు బ్రతకాలనుకున్నాడు అనేది కథ అని క్లుప్తంగా చూపించారు. నభా నటేష్, రావు రమేష్, సత్య తదితరులు ఆకట్టుకున్నారు. ట్రైలర్ చివర్లో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ‘మనిషి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.. పెళ్లి చేసుకోవాలి.. మంచిగా ఉండండి’ అని చెప్పడం హైలెట్‌గా నిలిచింది.

విజువల్స్, ఆర్ఆర్ బాగా కుదిరాయి. క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : థమన్, కెమెరా : వెంకట్ సి దిలీప్, ఎడిటర్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఫైట్స్ : వెంకట్, లిరిక్స్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కాసర్ల శ్యామ్, రఘురామ్.

×