Jr NTR: సంబంధం లేని విషయాల్లోకి ఎన్టీఆర్‌ని లాగుతున్నారు

సంబంధం లేని అంశాల్లోకి జూనియర్ ఎన్టీఆర్‌ని లాగుతున్నారంటూ.. వివాదాలు సృష్టిస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jr NTR: సంబంధం లేని విషయాల్లోకి ఎన్టీఆర్‌ని లాగుతున్నారు

Jr NTR: సంబంధం లేని అంశాల్లోకి జూనియర్ ఎన్టీఆర్‌ని లాగుతున్నారంటూ.. వివాదాలు సృష్టిస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రైలర్ రిలీజ్ సంధర్భంగా విజయవాడలో థియేటర్లు వద్ద సందడి చేసిన అభిమానులు.. ఎన్టీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగు ఓట్లు తేలేనివాళ్లు కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని విమర్శిస్తున్నారు అంటూ ప్యాన్స్ విమర్శించారు. ప్రజలకోసం జూనియర్ త్వరలోనే కీలకనిర్ణయం తీసుకుంటారని అభిమానులు అన్నారు. RRR మూవీ ట్రైలర్ సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు అభిమానులు. కొన్నిచోట్ల అభిమానులు థియేటర్లలోకి దూసుకుని రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. సినిమా ట్రైలర్ సమయంలోనే రిలీజ్ అయినంత హడావుడి చేస్తున్నారు అభిమానులు. బాణాసంచా పేల్చి, కేకులు కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు.