చలో నా అకౌంట్‌ని Deactivate చేస్తున్నా – సోనాక్షి
బాలీవుడ్ లో ఏం జరుగుతోంది ? యువ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగంలో మాఫియా తిష్ట వేసిందంటూ తిట్టిపోస్తున్నారు. ఎవరి సపోర్టు లేకుండానే పైకి ఎదుగుతున్న వారిని అణిచివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పలువురు నటీ, నటులు సోషల్ మీడియా వేదికగా బాహాటంగానే విమర్శలు చేస్తుండడంతో బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. పలువురు హీరో, హీరోయిన్లకు ఫ్యాన్స్ దూరం అవుతున్నారు. సోషల్ మీడియాలో వారిని అన్ ఫాలో చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి సోనాక్షి సిన్హా ట్విట్టర్ ఖాతా నుంచి దూరంగా వచ్చేసింది.
తాత్కాలికంగా డియాక్టివ్ చేస్తున్నట్లు తెలిపింది. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే..నెగటివికి దూరంగా ఉండాలి..ట్విట్టర్ వల్ల ఆ ప్రశాంతత కరువైందని, అందుకే గుడ్ బై చెబుతున్నా అంటూ ఇన్ స్ట్రా గ్రామ్ లో వెల్లడించారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో కామెంట్స్ సెక్షన్ ను డిసెబుల్ చేశారు.
ఇటీవలే ప్రసారమైన కోన్ బనేగా కరోడ్ పతిలో రామయణానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో సోనాక్షి విఫలమయ్యారు. దీంతో తరచూ సోనాక్షిని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తుంటారు. ఇది అయి..నెలలు గడుస్తున్నా..నెటిజన్లు ట్రోల్ చేయడం నిరాశపరిచిందని సోనాక్షి ఇటీవలే వెల్లడించారు.
సోనాక్షి సిన్హా దబాంగ్ సిరీస్, యాక్షన్ జాక్సన్, రాజ్ కుమార్, కలంక్, లూటేరా, మిషన్ మంగల్, ఖండాని, షఫఖనా చిత్రాల్లో నటించి…మంచి పేరు తెచ్చుకున్నారు. లాల్ కప్తాన్, దబాంగ్ – 3, భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు ఈ భామ.
Read: అమృత -మారుతీ రావుపై ‘వర్మ’ సినిమా..’మర్డర్’ ఫస్ట్‌లుక్