Sonam Kapoor : ఆ సినిమాకు రూ.11లు రెమ్యునరేషన్‌ తీసుకున్న సోనమ్ కపూర్

సాధారణంగా హీరోల కంటే హీరోయిన్ ల రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే సినిమా హిట్ అయితే హీరోయిన్ పై పడేస్తారు నిందలు. తెరవెనుక హీరోయిన్ లు పడే కష్టానికి కూడా వెలుగులోకి రావు. అలాగే వాళ్లు చేసిన మంచి పనులు కూడా పెద్దగా వెలుగులోకి రావు. అదే జరిగింది ప్రముఖ బాలివుడ్ నటి సోనమ్ కపూర్ విషయంలో కూడా. ఘనవిజయం సాధించిన ఓ సినిమాకు సోనమ్ కపూర్ రెమ్యునరేషన్ గా కేవలం రూ.11 లే తీసుకుందనే విషయం తెలుసా?

Sonam Kapoor : ఆ సినిమాకు రూ.11లు రెమ్యునరేషన్‌ తీసుకున్న సోనమ్ కపూర్

Sonam Kapoor

Sonam Kapoor Remuneration For Rs.11 : సాధారణంగా హీరోల కంటే హీరోయిన్ ల రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే సినిమా హిట్ అయితే హీరోయిన్ పై పడేస్తారు నిందలు. అలాగే తెరవెనుక హీరోయిన్ లు పడే కష్టానికి కూడా వెలుగులోకి రావు. అలాగే వాళ్లు చేసిన మంచి పనులు కూడా పెద్దగా వెలుగులోకి రావు. అదే జరిగింది ప్రముఖ బాలివుడ్ నటి సోనమ్ కపూర్ విషయంలో కూడా. ఘనవిజయం సాధించిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ సినిమాకు రెమ్యునరేషన్ గా కేవలం రూ.11 లే తీసుకుందనే విషయం ఎంత మందికి తెలుసు? అటువంటి సోనమ్ కపూర్ పై ప్రశంసలు కురిపించారు ఆ సినిమా డైరెక్టర్ రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా.తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని 8 ఏళ్ల తరువాత వెల్లడించారు రాకేశ్ మెహ్రా.

‘‘ఫ్లైయింగ్‌ సిఖ్‌’’గా ప్రసిద్ధి పొందిన భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫరాన్‌ అక్తర్‌, సోనం కపూర్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడమే అదృష్టంగా భావించిన నటీనటులు.. పారితోషికం విషయంలో పెద్ద మనస్సు చాటుకున్నారు. ఈ సినిమాకు సోనంకపూర్ కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్‌ తీసుకున్నారని భాగ్‌ మిల్కా భాగ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా తన బయోగ్రఫీలో వెల్లడించారు.

త్వరలో విడుదల కానున్న ‘‘ది స్ట్రేంజర్‌ ఇన్‌ ది మిర్రర్‌’’లో సోనంపై ప్రశంసలు కురిపించిన రాకేశ్‌ ఓంప్రకాశ్‌.. ‘‘ఇది లవ్‌స్టోరీ కాదని సోనంకు ముందే తెలుసు. బాల్యంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించటానికి సోనం ఏమాత్రం వెనుకాడలేదు. వెంటనే ఒప్పుకొంది. అప్పటికే ఢిల్లీ-6 సినిమాలో మేం కలిసి పనిచేశాం. అప్పటి నుంచి మా మధ్య చక్కటి అనుబంధం ఏర్పడింది.

భాగ్‌ మిల్కా భాగ్‌ గురించి చెప్పగానే సోనమ్ తనకు వారం రోజులు సమయం కావాలని అడిగింది. కేవలం 11 రూపాయలు తీసుకుని బీరో పాత్రలో నటించింది. చక్కటి అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుందని తెలిపారు.సోనమ్ తో అనుబంధం ఏర్పడ్డాక తనేంటో తెలిసిందని తనది చాలా మంచి మనస్సు అని కితాబులిచ్చారు డైరెక్ట్ రాకేశ్ ఓం ప్రకాశ్.కాగా 2013లో విడుదలైన భాగ్‌ మిల్కా భాగ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇందులో మిల్కాసింగ్‌ ఇష్టసఖి పాత్రలో సోనం కపూర్ చక్కగా అభినయాన్ని ప్రదర్శిచింది. కాగా..ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన భాగ్ మిల్కా భాగ్ ఆరవ అత్యధిక వసూళ్లు చేసిన 2013 బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.

భాగ్ మిల్ఖా భాగ్ ది రేస్ ఆఫ్ మై లైఫ్ స్ఫూర్తితో అతని కుమార్తె సోనియా సన్వాల్కా రాశారు. ఈ సినిమా హక్కులను ఒక రూపాయికి విక్రయించారు. ఈ సినిమా లాభాలలో వాటాను మిల్కా సింగ్ చారిటబుల్ ట్రస్ట్‌కు ఇస్తారని పేర్కొంటూ ఒక నిబంధనను చేర్చారు. పేద మరియు పేద క్రీడాకారులకు సహాయం చేయడంఈ చారిటబుల్ ట్రస్ట్ 2003 లో ఏర్పాటు చేశారు.