కంటతడి పెట్టిస్తున్న సింగరేణి కాలనీ చిన్నారి పాట..! చిన్ని చిన్ని పాదాలురా.. అడుగులు ఏమాయెరా..?

ప్రైవేటు ఆల్బమ్ పాటలోని పదాలు.. ఇప్పటి ఈ దారుణాన్ని.. ఆ చిన్నారికి జరిగిన అన్యాయాన్ని, కన్నవారి గుండె కోతను కళ్లకు కడుతున్నాయి.

10TV Telugu News

Singareni Colony Case : ఆరేళ్ల చిన్నారికి జరిగిన అన్యాయం.. జరగాల్సిన న్యాయం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లోని సైదాబాద్ -సింగరేణి కాలనీలో సెప్టెంబర్ 12న చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలన చర్చనీయాంశంగా మారింది. నిందితుడు పాప ప్రాణం తీసి పారిపోయాడు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అసలు నిందితుడు, జులాయి.. రాజును యాదాద్రి జిల్లాలో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఐతే… పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. నిందితుడిని ఉరితీయాలని జనం ఉక్కుపిడికిలి బిగించి డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ జనం చాలా ఫైర్ లో ఉన్నారు. పాప బతికున్నప్పటి వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Singareni Colony Rape Case : సింగరేణి కాలనీ చిన్నారి హత్య కేసు నిందితుడు అరెస్ట్ ?

ఏ పాపం తెలియని పసినవ్వు ఆమెది. ఏ మర్మం తెలియని పసి హృదయం ఆమెది. ఎథిక్స్ పరంగా.. ఆ చిన్నారి పేరును బయటపెట్టలేం. ఆ చిన్నారి ఫొటోను చూపించలేం. కానీ.. ఆ చిన్నారికి జరిగిన అన్యాయానికి మాత్రం చట్టాలు బదులివ్వాల్సిందే. నిందితుడికి దారుణ శిక్ష పడాల్సిందే. అప్పుడే ఆ కన్నవారి గుండెకోతకు కాస్తైనా సాంత్వన దక్కుతుంది. చిన్నారికి జరిగిన అన్యాయం తెల్సుకుని జనంలో రేగుతున్న అగ్ని జ్వాల చల్లారుతుంది.

పాప చిరునవ్వులు.. పాప ఆటపాట చూస్తే… ‘పాపం.. ముద్దుగారే చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయే’ అని బాధ కలుగుతోంది. పాప వీడియోలు.. ఫేస్ బుక్, ఇన్ స్టా, మాజ్, రీల్స్, షార్ట్స్, షేర్ చాట్, డైలీ హంట్, ట్విట్టర్ లలో పలు అకౌంట్లలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేటు ఆల్బమ్ పాటలోని పదాలు.. ఇప్పటి ఈ దారుణాన్ని.. ఆ చిన్నారికి జరిగిన అన్యాయాన్ని, కన్నవారి గుండె కోతను కళ్లకు కడుతున్నాయి.

చిన్ని చిన్ని పాదాలురా…
అడుగులు ఏమాయెరా..
అంతులేని దూరమాయెరా..
ఏ జన్మలో ఏ పాపం చేశామో…
మాకీ శోకం మిగిలిందేమో
గురుతులేదా తల్లి నీకు లాల పోసిన
చందమామ చూపి నీకు జోల పాడిన
మళ్లీ రావె తల్లి నీవు ఒంటరయ్యినా
తట్టుకోలేక నా ప్రాణం తల్లడిల్లి
కన్నతండ్రి మీద నీకు అంత కోపమా
ఎదుగుతుంటె తెలియలేదు ఇంత గాయమా
ఎత్తుకుని పెంచినా… రక్తమంత పంచిన
కష్టమెంత వచ్చినా.. కడుపులోన దాచిన. 

Singareni Colony : వాణ్ని ఎన్ కౌంటర్ చేసుడే : మంత్రి మల్లారెడ్డి

10TV Telugu News