సోనూ సూద్ హీరోగా.. ఉమేష్ చంద్ర బయోపిక్..

సోనూ సూద్ హీరోగా.. ఉమేష్ చంద్ర బయోపిక్..

Umesh Chandra: సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ మూవీస్‌కి ఉండే క్రేజే వేరు.. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్, పొలిటిషియన్స్, స్పోర్ట్ పర్సనాలిటీస్‌కి సంబంధించిన నిజ జీవిత కథలకు వెండితెర రూపమివ్వగా మంచి ఆదరణ దక్కింది. తెలుగులో ‘మహానటి’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది చెప్పక్కర్లేదు. ఆ కోవలో మరో తెలుగు వ్యక్తి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ఆధారంగా ఓ క్రేజీ బయోపిక్ తెరకెక్కబోతోంది.

పోలీస్ శాఖలో రెబల్ ఆఫీసర్‌గా, అందరిచేత ‘కడప టైగర్‌’ అనిపించుకున్న ఎస్పీ చదలవాడ ఉమేష్ చంద్ర జీవితం సినిమాగా రానుంది. ఉమేష్ చంద్ర లైఫ్ స్టోరీ చాలామందికి స్ఫూర్తినిచ్చింది. వృత్తి పరంగా డేర్ అండ్ డాషింగ్ వ్యవహరించేవారాయన.

మరో విశేషం ఏంటంటే.. లాక్‌డౌన్ సమయంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయమందించి ‘రియల్ హీరో’, ‘హెల్పింగ్ హ్యాండ్’ అనిపించుకున్న సోనూ సూద్ ఈ బయోపిక్‌లో ఉమేష్ చంద్ర క్యారెక్టర్ చెయ్యబోతున్నారు. విధి నిర్వహణలో ఉమేష్ చంద్ర వేసిన డేరింగ్ స్టెప్స్, పర్సనల్ లైఫ్, మరణం.. ఇలా అన్ని విషయాలూ బయోపిక్‌లో చూపించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.