Chandrababu-Sonusood: కరోనా విపత్తులో సోనూసూద్ సేవలు అపారం: చంద్రబాబు

కరోనా విపత్తులో సినీ నటుడు సోనూసూద్ అందించిన సేవలు అపారమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై చంద్రబాబు శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్ తో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా పాల్గొన్నారు.

Chandrababu-Sonusood: కరోనా విపత్తులో సోనూసూద్ సేవలు అపారం: చంద్రబాబు

Sonusoods Services In The Corona Disaster Are Immense Chandrababu

Chandrababu-Sonusood: కరోనా విపత్తులో సినీ నటుడు సోనూసూద్ అందించిన సేవలు అపారమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై చంద్రబాబు శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్ తో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు కరోనా విపత్తులో సోనూసూద్ అందించిన సేవలు అపారమని, వలస కూలీల పట్ల ఎంతో ఔదార్యం చూపారని పేర్కొన్నారు.

మదనపల్లెలో పొలం దున్నుతున్న పేద కుటుంబానికి ట్రాక్టర్ అందించి ఉదారత చాటుకున్న సోనూసూద్ సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సేవ చేయటం తన బాధ్యతగా భావించి ముందుకొచ్చారని అభినందించారు. కోవిడ్ పై పోరాటంలో కుటుంబసభ్యులు సైతం రోగుల వద్దకు వెళ్లేందుకు భయపడితే ఫ్రంట్ లైన్ వారియర్లు ఎంతో విలువైన సేవలందించారని.. అలాంటి ఫ్రంట్ లైన్ వారియర్లందరికీ చంద్రబాబు సెల్యూట్ చేశారు.

తన రాజకీయ జీవితం, పాలనలో నేను ఎన్నో విపత్తులు చూశానని.. కానీ కరోనా లాంటి సంక్షోభం చూడటం ఇదే ప్రథమం అన్నారు. హుద్ హుద్ తో పాటు అనేక ప్రకృతి విపత్తుల్లో ఎన్టీఆర్ ట్రస్టు, తెలుగుదేశం పార్టీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపిన ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవే ప్రధాన అజెండాగా ముందుకెళ్తున్నామన్నారు. కరోనా విపత్తులోనూ ఆన్లైన్ టెలి మెడిసిన్ ద్వారా తోచిన సాయం చేస్తున్నామని.. మూడో దశ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. మొదటి రెండు దశ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మూడో దశను ఎదుర్కొనేందుకు అంతా సన్నద్ధం కావాలని, అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మూడవ దశ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని.. రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారు కరోనా కారియర్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. సేవ చేసేందుకు ప్రభుత్వానికి ఎన్నో అధికారాలు, వనరులు ఉంటాయని.. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఫ్రంట్ లైన్ వారియర్లు అంతా కలసికట్టుగా కృషిచేయాలని, సమాజానికి సేవ అందిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు.